ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు
eenadu telugu news
Published : 20/09/2021 06:15 IST

ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు

టెక్కలిలో భోజనం కోసం సిబ్బంది పడిగాపులు

టెక్కలి, టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే : జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపునకు హాజరైన ఉపాధ్యాయులకు గుర్తింపుకార్డులు లేవని పోలీసులు అనుమతించకపోవడంతో తొలుత ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. పాత్రికేయులను చరవాణిలతో కళాశాల ప్రాంగణంలోకి అనుమతించమని అడ్డుకోవడంతో గందరగోళ పరిస్థితి ఎదురైంది. అల్పాహారం, భోజన ఏర్పాట్లు తగినన్ని చేయకపోవడంతో సిబ్బంది ఇబ్బందిపడ్డారు. జిల్లా ఎస్పీ అమిత్‌బర్దార్‌, ఎన్నికల పరిశీలకుడు చక్రవర్తి, జేసీ కె.శ్రీనివాసులు లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించారు. సబ్‌కలెక్టర్‌ వికాస్‌మర్మత్‌, డీఎస్పీ శివరామిరెడ్డి ఉదయం నుంచి సాయంత్రం వరకు లెక్కింపు కేంద్రం వద్దే ఉండి పర్యవేక్షించారు. టెక్కలి జడ్పీటీసీ సభ్యురాలిగా గెలుపొందిన దువ్వాడ వాణి ధ్రువపత్రం తీసుకునేందుకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో కలసి లెక్కింపు కేంద్రానికి వచ్చారు. అభ్యర్థుల గెలుపు సంబరాలను కళాశాల ప్రాంగణం బయట అభిమానులు నిర్వహించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని