24, 25 తేదీల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు
eenadu telugu news
Published : 21/09/2021 05:51 IST

24, 25 తేదీల్లో అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు

కలెక్టరేట్‌ (శ్రీకాకుళం), న్యూస్‌టుడే: మండల, జిల్లా పరిషత్తు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు సంబంధించి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఈనెల 24న మండల, 25న జిల్లా పరిషత్తు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు ఉంటాయన్నారు. ఎన్నికల కమిషన్‌ సూచనల మేరకు అన్ని మండలాలకు ప్రిసైడింగ్‌ అధికారులను నియమించామన్నారు. జడ్పీకి కలెక్టర్‌ ప్రిసైడింగ్‌ అధికారిగా ఉంటారన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని