24 అంశాలతో పాలక మండలి సమావేశం
eenadu telugu news
Published : 18/09/2021 05:30 IST

24 అంశాలతో పాలక మండలి సమావేశం

జీవీఎంసీలో ఏర్పాట్లు

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: మహా విశాఖ నగరపాలక సంస్థ పాలక మండలి(కౌన్సిల్‌) సమావేశం శనివారం ఉదయం జీవీఎంసీ సమావేశ మందిరంలో ప్రారంభం కానుంది. తొలుత 24 అంశాలతో అజెండా తయారు చేసిన అధికారులు, మరో నాలుగు అంశాలతో టేబుల్‌ అజెండాను సిద్ధం చేస్తున్నారు. జీవీఎంసీ దుకాణాల లీజులు, అద్దెలకు సంబంధించి ఎలాంటి అంశాన్ని చేర్చలేదని మేయరు గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు.

ఉత్తర్వుల్లో ఒకటి...అజెండాలో మరొకటి...: నగరంలో ఎస్సీ ఉప ప్రణాళిక నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులను జీవీఎంసీ సాధారణ నిధుల నుంచి గుత్తేదారులకు ఇవ్వడానికి కౌన్సిల్‌ సమావేశంలో చర్చించే అంశాన్ని అజెండాలో చేర్చారు. అందులో ఇంజినీరింగ్‌ అధికారులు 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి 2020-21 వరకు రూ.40.67కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జులై 16న ఇచ్చిన ఉత్తర్వుల్లో 2018-19, 2019-2020 ఆర్థిక సంవత్సరాలలో ఎస్సీ ఉప ప్రణాళిక నిధులతో పనులు చేసిన గుత్తేదారులకు నిధులివ్వాలని స్పష్టంగా పేర్కొంది. ఆ ఉత్తర్వులను గమనించకుండా జీవీఎంసీలో 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి చెల్లించాల్సిన బకాయిలివ్వడానికి అనుమతి కోరడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై సమావేశంలో సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని