ఎంపీ నిధులతో ఆసుపత్రులకు అంబులెన్సులు
eenadu telugu news
Published : 24/09/2021 04:43 IST

ఎంపీ నిధులతో ఆసుపత్రులకు అంబులెన్సులు


జోనల్‌ కమిషనర్‌కు మంజూరు పత్రాలు ఇస్తున్న ఎంపీ సత్యవతి

నెహ్రూచౌక్‌ (అనకాపల్లి), న్యూస్‌టుడే: ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి 2019-20 ఏడాదికి సంబంధించి అనకాపల్లి ఎన్టీఆర్‌ జిల్లా ఆసుపత్రి, నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి రెండు అంబులెన్సులు ఎంపీ నిధుల నుంచి మంజూరు చేస్తూ సంబంధించిన పత్రాలను గురువారం ఆసుపత్రి అధికారులకు అందజేశారు. రూ.69 లక్షలతో అత్యాధునిక వైద్య పరికరాలు అమర్చిన అడ్వాన్స్‌ లైఫ్‌ సపోర్టు అంబులెన్సులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ఎన్టీఆర్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శ్రావణ్‌కుమార్‌, నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి ఇన్‌ఛార్జి డేవిడ్‌ అంబులెన్సులకు సంబంధించిన పత్రాలను అందుకున్నారు. జీవీఎంసీ అనకాపల్లి జోన్‌ పరిధిలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రూ.21.57 లక్షల వ్యయంతో ఆరు వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకర్‌ను మంజూరు చేస్తూ కమిషనర్‌ కనకమహాలక్ష్మికి పత్రాలను అందజేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని