బృహత్తర ప్రణాళికపై ఆరా!
eenadu telugu news
Published : 24/10/2021 05:42 IST

బృహత్తర ప్రణాళికపై ఆరా!

ఈనాడు, విశాఖపట్నం : విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌ (బృహత్తర ప్రణాళిక)-2041పై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి అధికారులతో చర్చించారు. మార్పులు చేర్పులు ఎంతవరకు వచ్చాయి, తుది చిత్రపటాలు ఎప్పటికి సిద్ధమవుతాయి వంటి అంశాలపై శనివారం మాట్లాడారు. మాస్టర్‌ ప్లాన్, బడ్జెట్, అనుమతి తీసుకోవాల్సిన ఇతర అంశాలపై సమావేశం నిర్వహించాలని సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సోమవారం ఈ అథారిటీ సమావేశం వర్చువల్‌ విధానంలో నిర్వహించాలని తెలియజేశారు. లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) పొడిగింపుపై ఆమె వద్ద ప్రస్తావించగా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ప్రత్యేక కార్యదర్శిని కలిసిన వారిలో వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ వెంకటరమణారెడ్డి, సెక్రటరీ రఘునాథరెడ్డి, సీయూపీ సురేశ్‌కుమార్‌  పాల్గొన్నారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని