Accident: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
eenadu telugu news
Updated : 21/10/2021 00:43 IST

Accident: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

షామీర్‌పేట్‌: పెళ్లికి వచ్చిన బంధువులను తీసుకువెళ్లేందుకు రాజీవ్‌ రహదారిపైకి వచ్చిన ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృత్యువాత పడిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు షామీర్‌పేట్‌ ఎస్సై గణేశ్‌, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం .. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన బొడ్డు వెంకటరాజు(40) హైదరాబాద్‌ హైటెక్‌సిటీలో ప్రైవేట్‌ జాబ్‌ చేస్తున్నాడు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా షామీర్‌పేట్‌ మండలం మజీద్‌పుర గ్రామంలో ఉన్న తన బంధువుల ఇంటికి వచ్చాడు. బుధవారం రాత్రి ఇతర బంధువులు కూడా అక్కడికి చేరుకోగా వారిని తీసుకు వచ్చేందుకు రాజు ద్విచక్రవాహనంపై అలియాబాద్‌ చౌరస్తా రాజీవ్‌ రహదారిపైకి వచ్చాడు. రోడ్డుదాటుతున్న క్రమంలో అటువైపుగా వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం రాజును ఢీకొనడంతో ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. వీరంతా హైదరాబాద్‌లో ఓ బంధువుల పెళ్లి వేడుకకు హాజరు కవావల్సివుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మేడ్చల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించి ఈమేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్టున్నట్లు ఆయన తెలిపారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని