close

ఆదివారం, ఆగస్టు 25, 2019

ప్రధానాంశాలు

బొల్లిరహిత రాష్ట్ర నిర్మాణానికి కృషి

గన్‌ఫౌండ్రి: బొల్లి వ్యాధిరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సెంటర్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎంఏ వహీద్‌ వెల్లడించారు. ఆయూష్‌ విభాగంలో ఆయనను కేంద్ర ప్రభుత్వం ఉపాధ్యక్షుడిగా నియమించింది. ఈ సందర్భంగా సోమవారం గన్‌ఫౌండ్రిలోని మీడియా ప్లస్‌ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. బొల్లి (తెల్ల మచ్చలు) వ్యాధిగ్రస్థులు ఆత్మన్యూనతకు గురికాకుండా ఉండేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ఈ వ్యాధి వంశపారంపర్యగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. సముద్రపు చేపలతో సోకే అవకాశాలు ఎక్కువని అభిప్రాయపడ్డారు.సమావేశంలో సీఆర్‌ఐయూఎం డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ మునావర్‌ హుస్సేన్‌ ఖాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.