close

బుధవారం, ఆగస్టు 21, 2019

ప్రధానాంశాలు

తరలింపా.. కొనసాగింపా!

ఆరు దశాబ్దాల ఆయుర్వేద ఆస్పత్రిపై సందిగ్ధం
పాతబస్తీ, శివారు రోగుల్లో ఆందోళన
చార్మినార్‌, న్యూస్‌టుడే

భారతీయ వైద్య విధానాలుగా ఖ్యాతి గడించిన ప్రభుత్వ యునానీ, ఆయుర్వేద ఆస్పత్రులు చార్మినార్‌లో పక్కపక్కనే కొనసాగుతున్నాయి. పాత  నగర వాసులతో పాటు శివారు ప్రాంతాలకు చెందిన రోగులు నమ్మకంతో వివిధ దీర్ఘకాలిక జబ్బుల నయం కోసం అక్కడికి వెళ్తారు. ఎలాంటి దుష్పరిణామాలు (సైడ్‌ ఎఫెక్టు) ఉండవని రోగులు ఆ వైద్యానికి ఆసక్తి చూపుతారు. ఆరు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న చార్మినార్‌ ఆయుర్వేద ఆస్పత్రిలో సర్జరీ, పక్షవాత, ప్రసూతి, జనరల్‌, ఈఎన్‌టీ, డెంటల్‌, బాలరోగులకు చికిత్సలు అందించే విభాగాలు ఉన్నాయి. అంతటి కీలకమైన ఆస్పత్రి తరలిపోతుందనే వందంతులు పాతబస్తీవాసుల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

ఇదిగో ఇలా..
చార్మినార్‌ ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి వంద పడకలతో కొనసాగుతోంది. చార్మినార్‌ ఆయుర్వేద ఆస్పత్రి కోసం ప్రత్యేకంగా రూ.50 లక్షల నిధులతో నిర్మించాలని తలపెట్టిన అవుట్‌ పేషెంట్‌ బ్లాక్‌ పనులు నిధులు మంజూరైనా ప్రారంభం కాలేదు. అదే ఇక్కడి ఆస్పత్రి ఆవరణంలో యునానీ అవుట్‌పేషంట్‌ విభాగంతోపాటు వైద్య విద్యార్థులు హాస్టల్‌ వసతి కోసం రూ.నాలుగు కోట్ల నిధులతో మూడు అంతస్తుల భవన నిర్మాణ పనులతోపాటు యునానీ ఆస్పత్రి కొనసాగే భవనంలోని గదుల మరమ్మతులు కొనసాగుతున్నాయి. ఈ పనులు ఒకవైపు కొనసాగుతున్నప్పటికీ చార్మినార్‌ ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి ఎర్రగడ్డలోని ఆయుర్వేద ఆస్పత్రికి తరలిస్తున్నారని వదంతులు వచ్చాయి. వాటికి బలం చేకూర్చేలా ఓ ఆయుర్వేద వైద్యుడు ప్రభుత్వానికి ప్రతిపాదించారని ప్రచారం జరుగుతోంది. ఏళ్ల తరబడి పాత నగర ప్రజలకు దీర్ఘకాలిక జబ్బులు పక్షవాతం, కీళ్లనొప్పులు, చర్మవ్యాధులు, ఫిస్టులా తదితర జబ్బుల నయంలో చార్మినార్‌ ఆయుర్వేద ఆస్పత్రి వైద్యులు ఎంతో మెరుగుగా చికిత్స చేస్తారనే నమ్మకం జనంలో ఉంది. ఈ ఆస్పత్రిని ఆకస్మికంగా ఎర్రగడ్డకు తరలిస్తారని ప్రచారం కొనసాగడంతో ఆయుర్వేద వైద్య సిబ్బందితోపాటు రోగులు సైతం దిగులు చెందుతున్నారు.

వదంతులు మాత్రమే..
- డాక్టర్‌ సుద్దాల రాజమౌళి, చార్మినార్‌ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌
చార్మినార్‌ ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిని ఎర్రగడ్డకు తరలిస్తారని వస్తున్న వదంతులలో వాస్తవం లేదు. ఆస్పత్రి భవన గదులకు మరమ్మతులు చేపట్టాలని ఆయుర్వేద వైద్య విభాగం ఉన్నతాధికారులకు విన్నవించాం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.