25న విజయవాడలో వీఆర్వోల రాష్ట్ర సదస్సు - East%20Godavari - EENADU
close

ఆదివారం, సెప్టెంబర్ 15, 2019

ప్రధానాంశాలు

25న విజయవాడలో వీఆర్వోల రాష్ట్ర సదస్సు


మాట్లాడుతున్న వీఆర్వోల జిల్లా సంఘ అధ్యక్షుడు బాపూజీ

కాకినాడ నగరం: విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈనెల 25న జరిగే వీఆర్వోల రాష్ట్ర స్థాయి సదస్సు విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.బాపూజీ కోరారు. కాకినాడలోని అర్బన్‌ తాహసీల్దారు కార్యాలయ ఆవరణలోని పింఛనర్ల సంఘ భవనంలో జిల్లా వీఆర్వోల సంఘ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ఏర్పాటుకు ఇచ్చిన ఉత్తర్వుల్లో సెలవు, జీతభత్యాలు, ఇంక్రిమెంట్లు, సర్వీసు రిజిష్టరు నిర్వహణ పేరెంట్‌ డిపార్టుమెంట్‌లోనే కొనసాగించాలని కోరారు. వీఆర్వోల పద్నోతులకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చాలన్నారు. సమావేశంలో పలు అంశాలను చర్చించి తీర్మానించారు. ఈ సమావేశంలో సంఘ ప్రధాన కార్యదర్శి కేవీ సత్యనారాయణ, గౌరవాధ్యక్షుడు కేవీ రమణ, వివిధ మండలాలు, డివిజన్లకు చెందిన వీఆర్వోల సంఘ బాధ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.