10 లక్షల టన్నుల బొగ్గు సరఫరా - Bhadradri - EENADU
close

శనివారం, సెప్టెంబర్ 21, 2019

ప్రధానాంశాలు

10 లక్షల టన్నుల బొగ్గు సరఫరా

ఈ ఏడాదిలో బీటీపీఎస్‌ లక్ష్యమిదే..

పీవీకాలనీ(మణుగూరు), న్యూస్‌టుడే

భద్రాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రంలో కరెంటు ఉత్పత్తి కోసం 2019-20 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ 10 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయనుంది. మణుగూరు నుంచి బీటీపీఎస్‌కు రోడ్డు మార్గం ద్వారా బొగ్గు రవాణా జరిగేందుకు కేంద్ర పర్యావరణశాఖ అనుమతి ఇచ్చిన విషయం విధితమే. ప్రస్తుతం ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో అయిదు నెలలు పూర్తి అయింది. ఇంకా ఏడు నెలలు మాత్రమే ఉంది. బీటీపీఎస్‌లో మొదటి యూనిట్‌ నుంచి విద్యుత్తు ఉత్పత్తి జులైలో ప్రారంభించాల్సి ఉండగా అనివార్య కారణాలతో కొంత ఆలస్యమైంది. మొదటి యూనిట్‌ను సింక్రనైజేషన్‌ను పూర్తి చేసి, అక్టోబరులో ఉత్పత్తి చేసిన విద్యుత్తును గ్రిడ్‌కు అనుసంధానం చేస్తామని జెన్కో ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు. అందుకు బీటీపీఎస్‌కు 10 లక్షల టన్నుల బొగ్గు అవసరం ఉండనుంది. అంటే రోజుకి 4,761 టన్నుల బొగ్గు, రోజుకి 238 ట్రిప్పులు బొగ్గు మాత్రమే బొగ్గు రవాణా జరగనుంది. ఈ ఏడాది డిసెంబరు కల్లా బీటీపీఎస్‌లో నాలుగు యూనిట్ల సింక్రనైజేషన్‌ పూర్తయిన తర్వాత అంటే వచ్చే ఏడాది నుంచి రోజుకి 13,129 టన్నుల బొగ్గు, 655 ట్రక్కుల ద్వారా రవాణా జరగనుంది.

రెండు గనుల నుంచి మాత్రమే సరఫరా

బీటీపీఎస్‌ కేంద్రానికి ఈ ఏడాదిలో రోడ్డు మార్గం ద్వారా రవాణా జరగనున్న 10 లక్షల టన్ను బొగ్గును మణుగూరు ఏరియాలోని, ఓసీ 4, మణుగూరు ఓసీ గనుల నుంచి మాత్రమే రవాణా జరగనుంది. విద్యుత్తు ఉత్పత్తి కోసం జీ 9 నాణ్యత కలిగిన బొగ్గు అవసరం ఉండనుంది. ఈ రెండు గనుల్లో జీ 9 నాణ్యత కలిగిన బొగ్గు ఉత్పత్తి అవుతుంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో మణుగూరు ఏరియా నుంచి 95 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యం నిర్ణయించారు. ఇప్పటికే 34 లక్షల టన్నుల బొగ్గును వెలికి తీసి రవాణా చేశారు. ఎంచుకున్న లక్ష్యంలో ఓసీ 4 35 లక్షలు, మణుగూరు ఓసీ 21 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాల్సి ఉంది. జీ 9 నాణ్యత కలిగిన బొగ్గు ఉత్పత్తి జరగటం, రవాణాకు సౌలభ్యంగా ఉండటం ఈ రెండు గనుల నుంచి మాత్రమే బీటీపీఎస్‌కు బొగ్గు రవాణా చేయాలని సింగరేణి నిర్ణయించింది. అంటే బొగ్గు రవాణాలో ఓసీ 4, మణుగూరు ఓసీ గనులు చెరో 50 శాతం బొగ్గును రవాణా చేయనున్నాయి. బీటీపీఎస్‌కు కావాల్సిన జీ 9 నాణ్యత బొగ్గును సింగరేణి నుంచి జెన్కో సంస్థ టన్నుకు రూ.2,510 పెట్టి కొనుగోలు చేస్తుంది.

సెప్టెంబరు నుంచి సరఫరా చేస్తాం

జక్కం రమేశ్‌, ప్రధాన అధికారి, మణుగూరు

భద్రాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రానికి కావాల్సిన బొగ్గును సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ ఏడాదిలో బీటీపీఎస్‌కు 10 లక్షల టన్ను బొగ్గును మణుగూరు ఓసీ, ఓసీ 4 గని నుంచి సరఫరా చేస్తాం. సెప్టెంబరు 15 తర్వాత బీటీపీఎస్‌కు బొగ్గు అవసరం ఏర్పడుతుందని జెన్కో అధికారులు పేర్కొన్నారు. బీటీపీఎస్‌కు కావాల్సిన జీ 9 నాణ్యత కలిగిన బొగ్గును సరఫరా చేస్తాం.

మణుగూరు ఏరియా గనుల్లో ఉత్పత్తి అవుతున్న బొగ్గు

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.