close

మంగళవారం, నవంబర్ 19, 2019

ప్రధానాంశాలు

డిజిటల్‌ టెక్నాలజీపై నేటి నుంచి సదస్సు

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: మన జీవన విధానంలోని ప్రతి అంశంలోనూ డిజిటల్‌ టెక్నాలజీ నేడు ప్రవేశించిందని, ప్రాజెక్టుల నిర్మాణాన్ని సైతం సులువుగా మార్చిందని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ ఇండియా (ఐఈఐ) రాష్ట్ర ఛైర్మన్‌ డా.జి.రామేశ్వర్‌రావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ‘సర్వేయింగ్‌, మ్యాపింగ్‌, అప్లికేషన్స్‌లో డిజిటల్‌ టెక్నాలజీ’ అనే అంశంపై ఈ నెల 15, 16 తేదీల్లో రెండు రోజుల సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన ఖైరతాబాద్‌లోని ఐఈఐలో సోమవారం వెల్లడించారు. సదస్సుకు రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేష్‌రంజన్‌ హాజరై మాట్లాడతారన్నారు. ఈ అవకాశాన్ని ఇంజినీరింగ్‌ విద్యార్థులు, ఇంజినీర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఐఈఐ గౌరవ కార్యదర్శి టి.అంజయ్య, ఇంజినీర్లు జీఎస్‌కుమార్‌, డా.రాఘవస్వామి, ప్రొ.జి.రాధాకృష్ణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.