close

మంగళవారం, నవంబర్ 19, 2019

ప్రధానాంశాలు

కొత్త రిజిస్ట్రార్‌ ఎవరో?

బాధ్యతల నుంచి తప్పుకొంటున్న బలరాములు

న్యూస్‌టుడే, తెవివి క్యాంపస్‌(డిచ్‌పల్లి)

తెలంగాణ విశ్వవిద్యాలయ కొత్త రిజిస్ట్రార్‌గా ఎవరిని నియమిస్తారోనని ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్న ఆచార్య బలరాములు బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు వర్సిటీలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. వాస్తవానికి గత నెల 19వ తేదీకే పదవీకాలం పూర్తయింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఆచార్యునిగా ఉన్న ఆయన్ను మాజీ ఉపకులపతి సాంబయ్య రిజిస్ట్రార్‌గా నియమించారు. బలరాములుకు అంటిల్‌ ఫర్‌ ద ఆర్డర్‌ (తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగింపు) ఇచ్చారు. సహజంగా రిజిస్ట్రార్‌ పదవీ కాలం ఏడాది. కానీ వర్సిటీకి ఇన్‌ఛార్జి ఉపకులపతిగా ఉన్న ఐఏఎస్‌ అధికారి అనిల్‌కుమార్‌ రిజిస్ట్రార్‌ మార్పుపై దృష్టి పెట్టలేదని అంతా భావించారు.

ఒత్తిళ్లకు తలొగ్గే..

రిజిస్ట్రార్‌ బలరాములు ఒత్తిళ్లకు తలొగ్గే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు అంతా చర్చించుకుంటున్నారు. పొరుగు సేవల ఉద్యోగుల అడ్డగోలు పదోన్నతుల్లో సహాయ సిబ్బంది చేతివాటం, రోడ్ల మరమ్మతుల పేరుతో చేపట్టిన పనులు, పరిపాలన పదవుల కేటాయింపుల వ్యవహారంలో రిజిస్ట్రార్‌ బలరాములును ఇన్‌ఛార్జి వీసీ తప్పుబట్టినట్లు తెలిసింది. ఈ క్రమంలో రోడ్ల పనులు, పొరుగు సేవల ఉద్యోగుల పదోన్నతుల్ని రద్దు చేయించారు. ఇది వర్సిటీలో చర్చనీయాంశమైంది. ఆచార్యుల్లో ఆధిపత్య పోరు, పరిపాలన పదవులు నిర్వహిస్తున్న అధికారులు సహకరించకపోవడం, వర్సిటీలో నెలకొంటున్న పరిణామాలు తీవ్రం కాకముందే బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. రిజిస్ట్రార్‌గా బలరాములు హయాంలో వర్సిటీలో జరిగిన వ్యవహారాలు, ఇష్టానుసారంగా పెట్టిన సంతకాలపై రహస్య విచారణ కొనసాగుతుందనే ప్రచారం ఉంది. ఇవి ఎక్కడ తన మెడకు చుట్టుకుంటాయోననే భయంతో ఆయన పదవిని వదులుకుంటున్నారని ఉద్యోగులు, సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. ఏడాది పదవి కాలం పూర్తవడం, వచ్చే ఏడాది మార్చిలో పదవీ విరమణ ఉండటంతో ఆయన తన మాతృ సంస్థ ఉస్మానియా వర్సిటీకి వెళ్తారనే వాదన కూడా ఉంది.

నూతన బాధ్యతలు ఎవరికో?

వర్సిటీ నూతన రిజిస్ట్రార్‌ ఎవరనే ఆతృత అందరిలో నెలకొంది. గతంలో రిజిస్ట్రార్‌గా పని చేసిన బోటనీ ఆచార్యులు విద్యావర్ధిణికి బాధ్యతలు ఇచ్చేందుకు ఇన్‌ఛార్జి వీసీ అనిల్‌కుమార్‌ ఉత్తర్వుల్ని సిద్ధం చేసినట్లు సమాచారం. ఆమె త్వరలోనే బాధ్యతలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే తనకు రిజిస్ట్రార్‌ పదవి ఇవ్వాలని పరిపాలన పదవిలో ఉన్న ఒక ఆచార్యుడు ఇన్‌ఛార్జి వీసీని కలిసినట్లు తెలిసింది. ఆయన కూడా రిజిస్ట్రార్‌ పదవి కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నట్లు ఉద్యోగులు అంటున్నారు. నవంబరులో ఇన్‌ఛార్జి వీసీ అనిల్‌కుమార్‌ పదవీ విరమణ ఉంది. ఈ క్రమంలో తెవివి కొత్త రిజిస్ట్రార్‌గా ఎవరిని నియమిస్తారనేది ఐఏఎస్‌ అధికారి అనిల్‌కుమార్‌ చేతుల్లో ఉంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.