close

గురువారం, నవంబర్ 21, 2019

ప్రధానాంశాలు

రాజుగారి గది-3 చిత్రబృందం సందడి

సమావేశంలో హీరోయిన్‌ అవికా గోర్‌, హీరో అశ్విన్‌బాబు, దర్శకనిర్మాత ఓంకార్‌

నిజామాబాద్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే: రాజుగారి గది-3 చిత్ర బృందం ఆదివారం ఇందూరులో సందడి చేసింది. సినిమా ప్రదర్శిస్తున్న లలితామహాల్‌ థియేటర్‌కు దర్శక నిర్మాత ఓంకార్‌, హీరో అశ్విన్‌బాబు, హీరోయిన్‌ అవికా గోర్‌ తరలివచ్చారు.ప్రేక్షకులతో సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా విలేకరులతో వారు మాట్లాడారు. ఆర్టీసీ సమ్మె ఉన్నా కూడా తమ చిత్రాన్ని గొప్పగా ఆదరిస్తున్నందుకు తెలంగాణ ప్రేక్షకులకు కృతజ్ఞతలని పేర్కొన్నారు. మరిన్ని మంచి సినిమాలను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యాజమాన్యం వెంకటేశ్‌, వైభవ్‌, మేనేజర్లు రవీందర్‌రెడ్డి, నాగేశ్వరరావు, మధు, ప్రవీణ్‌, అశోక్‌, శివ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.