close

గురువారం, నవంబర్ 14, 2019

ప్రధానాంశాలు

తెల్లబంగారం తళతళ.. మార్కెట్‌ కళకళ..!
వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ తరలివచ్చిన పత్తి బస్తాలు

వరంగల్‌ మార్కెట్‌, న్యూస్‌టుడే: వరస సెలవుల అనంతరం సోమవారం వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ సోమవారం తెరుచుకుంది. మార్కెట్‌కు సరకు పెద్ద మొత్తంలో తరలివచ్చింది. పత్తి సీజన్‌ అక్టోబర్‌ 1 నుంచి ప్రారంభం కాగా, మూడు వారాల అనంతరం మార్కెట్‌కు కొత్త పత్తి భారీగా తరలివచ్చింది. యార్డులో ఎటు చూసినా పత్తి బస్తాలే దర్శనమిచ్చాయి. వర్షం ఎప్పుడు కురుస్తుందో తెలియని పరిస్థితిలో రైతులు తెచ్చిన పత్తి బస్తాలను యార్డులో గద్దెలపై, షెడ్ల కింద వేసుకున్నారు. గతంలో మాదిరి కాకుండా అన్ని గద్దెలపై పత్తి బస్తాలు కనిపించాయి. మార్కెట్‌లో సాయంత్రం వరకు పత్తి తూకాలు సాగాయి.

వచ్చిన బస్తాలు: 14182

అమ్మకం: 7091 క్వింటాళ్లు

మొక్కజొన్నల రాక

వరంగల్‌ మార్కెట్‌కు మొక్కజొన్నలు గతం కంటే ఎక్కువ మొత్తంలో తరలిరావడంతో ధాన్యం అపరాల యార్డులో మొక్కజొన్నల రాశులు కనిపించాయి. ఊళ్లలో ఆరబోసుకునే అవకాశం లేకపోవడంతో రైతులు మార్కెట్‌ ప్లాట్‌ఫాంలపై ఎండబోసుకుంటున్నారు. సోమవారం సైతం పెద్ద ఎత్తున మొక్కజొన్నలు అమ్మకానికి వచ్చాయి. సాయంత్రం వరకు అధికారుల అంచనా ప్రకారం 1591 బస్తాలు, 943 క్వింటాళ్ల మొక్కజొన్నలు తూకాలు జరిగాయి. ఇక ధరల విషయానికి వస్తే మంచి మొక్కజొన్నలకు క్వింటాలుకు రూ.2052, కాస్త నాణ్యత తగ్గిన వాటికి రూ.2006, నాణ్యత లేని పంటకు రూ.1601 లభించాయి. తూకాలు కాకుండా మిగిలిపోయిన మొక్కజొన్నలు 600 బస్తాల వరకు ఉంటాయని అధికారులు వివరించారు. పసుపు కాడి 208 బస్తాలు, గోల రకం 90 బస్తాలు విక్రయానికి వచ్చింది.

మార్కెట్లో ఆరబోసిన మొక్కజొన్నలు

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.