close

బుధవారం, నవంబర్ 20, 2019

ప్రధానాంశాలు

పల్లెలకు మళ్లీ నిధులు

నెల వ్యవధిలో రెండోసారి విడుదల

సమస్యల పరిష్కారానికి అవకాశం

న్యూస్‌టుడే, వికారాబాద్‌ టౌన్‌

పంచాయతీలకు నిధులు వరదలా వస్తున్నాయి. గతంలో ఒకసారి నిధులు వస్తే మళ్లీ రావాలంటే నాలుగు నెలలైనా నిరీక్షించాల్సి వచ్చేది. ప్రస్తుతం అలా కాదు నెల రోజులు తిరక్కుండానే విడుదల అయ్యాయి. సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పల్లెలకు ఇది ఊరటనిచ్చే అంశం. జిల్లాకు మరోసారి 14వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు వచ్చాయి. వీటి వినియోగంతో సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం కానుంది. జిల్లాలో 565 పంచాయతీలు ఉన్నాయి.

రెండు నెలలు.. రూ.25.52 కోట్లు: పంచాయతీలకు గతంలో ఎన్నడూలేనంతగా నిధులు అందుతున్నాయి. పంచాయతీలకు గత నెలలో 14వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం కలిపి రూ.12.76 కోట్లు విడుదలయ్యాయి. నెల రోజులు గడవక ముందే మరోసారి నిధులు విడుదల కావడంతో పాలకవర్గాలు అభివృద్ధిపై ఉత్సాహంగా ముందుకు సాగనున్నాయి. తాజాగా జిల్లాలోని పంచాయతీలకు రూ.12.76 కోట్లు విడుదలయ్యాయి. వీటిని వసతుల కల్పనకు వినియోగించాల్సి ఉంటుంది.

సద్వినియోగంతోనే సత్ఫలితాలు: గత నెలలో జిల్లాకు రూ.12.76 కోట్లు విడుదలైనా ఇప్పటికీ గ్రామాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. చాలా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ గాడి తప్పింది. మురుగుకాల్వలు పూడికతీతకు నోచటంలేదు. వీధి దీపాలు పూర్తిస్థాయిలో వెలగక రాత్రిపూట అంధకారంతో ఇబ్బందులు పడాల్సివస్తోంది. తాగునీటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. నిధుల వినియోగంపై సరైన పర్యవేక్షణ లేకపోవటమే దీనికి కారణం. ఇబ్బందులు ఎవరితో చెప్పుకోవాలో తెలియటంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఏయే పనులకు..

తాగునీటి పైప్‌లైన్‌ ఏర్పాటుతోపాటు మోటార్ల కొనుగోలు, చేతిపంపులు, పవర్‌బోరు నిర్వహణ తదితరాలకు వ్యయం చేయడానికి వీలుంటుంది.

పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుకు వినియోగించవచ్ఛు మురుగు కాల్వల నిర్మాణం, డంపింగ్‌యార్డుల ఏర్పాటు.

అంగన్‌వాడీ కేంద్రాలు, ఏఎన్‌ఎం, ఉపకేంద్రాలు, పంచాయతీ భవనాలు, సామాజిక భవనాలకు సంబంధించిన పనులకు ఖర్చుచేయవచ్ఛు.

అంతర్గత రహదారుల నిర్మాణం, మరమ్మతులు.

వీధి దీపాల నిర్వహణ.. ఎల్‌ఈడీ దీపాలు, విడిభాగాల కొనుగోలు, మరమ్మతులకు వినియోగించవచ్ఛు.

శ్మశాన వాటికలకు ఫెన్సింగ్‌ ఏర్పాటు, అందులో నీటి వసతి కల్పించడం, మొక్కలు నాటడం.

నిబంధనల ప్రకారం వినియోగించాలి

రిజ్వానా , జిల్లా పంచాయతీ అధికారి

పంచాయతీలకు విడుదలైన నిధులను నిబంధనల ప్రకారం వినియోగించాలి. ఇవి సద్వినియోగమయ్యేలా చూస్తాం. ఎక్కడైనా దుర్వినియోగమైనట్లు తేలితే చర్యలు తీసుకుంటాం. తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలి. పంచాయతీ కార్యదర్శులకు ఇప్పటికే ఆదేశాలిచ్చాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.