close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

ప్రధానాంశాలు

కౌలు రైతులకు రూ. 42కోట్ల రుణాల లక్ష్యం  


మాట్లాడుతున్న డీసీవో తిరుపాల్‌రెడ్డి

 

నెల్లూరు (వ్యవసాయం), న్యూస్‌టుడే : ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా కౌలు రైతులకు ఈ ఏడాది రూ. 42కోట్లు రుణాలివ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా సహకారాశాఖాధికారి తిరుపాల్‌రెడ్డి తెలిపారు. 66వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా గురువారం నగరంలోని డీసీసీబీ కార్యాలయంలో గ్రామీణ సహకార సంస్థల ద్వారా నూతన ఆవిష్కరణల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ ఇచ్చే కౌలు రైతు గుర్తింపు కార్డులు(సీసీఆర్‌సీ) కలిగిన కౌలురైతులు జాయింట్‌ లైబుల్టీ గ్రూపుగా ఏర్పడి ఈ రుణాలను పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ సీఈవో వెంకటరమణారెడ్డి, నాబార్డు డీడీఎం రవిసింగ్‌, నెల్లూరు డివిజనల్‌ కోఆపరేటివ్‌ అధికారి శరభయ్య, ఓఎస్డీ అంజిరెడ్డి, ప్రాధమిక సహకార సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.