close

బుధవారం, డిసెంబర్ 11, 2019

ప్రధానాంశాలు

నినాదాలు.. నిరసనలు

45వ రోజుకు చేరిన సమ్మె

కరీంనగర్‌ రవాణా విభాగం, న్యూస్‌టుడే : దీక్షలు, నిరసనలతో ఆర్టీసీˆ కార్మికుల సమ్మె 45వ రోజుకు చేరింది. సోమవారం కరీంనగర్‌ రీజియన్‌లో పది డిపోల పరిధిలో ఆర్టీసీˆ ఉద్యోగులు దీక్షలు, నిరసనలు, ర్యాలీలు కొనసాగించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఆర్టీసీˆ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమ్మెకు అఖిలపక్ష నాయకులు మద్దతు ప్రకటించారు..

కరీంనగర్‌లో ఆర్టీసీˆ ఐకాస ఆధ్వర్యంలో ప్రయాణ ప్రాంగణంలో కార్మికులు రెండో రోజు దీక్షలు కొనసాగించారు. కేసీˆఆర్‌, మంత్రుల ముఖచిత్రాలతో కూడిన మాస్క్‌లతో వినూత్నంగా నిరసన తెలిపారు. పలువురు ఐకాస, అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం, ఆర్టీసీˆ యాజమాన్యం కార్మికులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. 45 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ మొండి వైఖరితో కార్మికులు మనోవేదనతో మరణిస్తున్నారని చెప్పారు. ఆర్టీసీˆ ఎండీ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ తప్పుడు సమాచారంతో కూడుకున్నదని ఆరోపించారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం, ఆర్టీసీˆ యాజమాన్యం ముందుకు రావాలని అన్నారు. కార్యక్రమంలో ఐకాస నాయకులు జక్కుల మల్లేశంగౌడ్‌, ఎం.పి.రెడ్డిఎన్‌.కె.రాజు, టి.ఆర్‌.రెడ్డి, సత్తయ్య, శ్రీనివాస్‌, మహేందర్‌, అఖిలపక్ష నాయకులు కళ్యాడపు ఆగయ్య, డాక్టర్‌ నగేశ్‌, సృజన్‌కుమార్‌, బండారి శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

* కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆర్టీసీˆ ప్రజా రవాణాకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కరీంనగర్‌ రీజియన్‌లో పది డిపోల పరిధిలో 674 బస్సులు నడిపింది. ఇందులో 483 ఆర్టీసీˆ, 191 అద్దె బస్సులు ఉన్నట్లు ఆర్‌ఎం జీవన్‌ప్రసాద్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.