close

శనివారం, జనవరి 18, 2020

ప్రధానాంశాలు

జాతీయ-అంతర్జాతీయ

శివదీక్షా విరమణలు ప్రారంభం

శిబిరంలో దీక్ష విరమణ చేస్తున్న దీక్షదారులు, పర్యవేక్షిస్తున్న ఈవో రామారావు

శ్రీశైలం, న్యూస్‌టుడే: శ్రీశైల మహాక్షేత్రంలో కార్తికమాస శివదీక్ష విరమణను గురువారం ఈవో కేఎస్‌.రామారావు ప్రారంభించారు. ఈ విరమణలు ఈ నెల 9వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జ్యోతిర్ముడులు సమర్పించి మాల విరమణ చేసేందుకు ప్రత్యేకంగా శివదీక్ష శిబిరాలను ఏర్పాటు చేశారు. ఆలయం ప్రాంగణంలోని స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను వెండిపల్లకీలో పాతాళగంగ మార్గంలోని శిబిరాలకు తరలించారు. కార్తికమాసాన్ని పురస్కరించుకొని అక్టోబర్‌ 29న మండలదీక్ష, నవంబర్‌ 18న అర్దమండలదీక్ష స్వీకరించిన శివస్వాములందరూ మాల విరమణ చేసేందుకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇరుముడులతో వచ్చే శివస్వాములకు నిర్ణీత సమయాల్లో రూ. 150 ప్రత్యేక క్యూలైన్లో స్వామిఅమ్మవార్ల స్పర్శదర్శనానికి ఏర్పాటు చేసింది. ఈ ఐదు రోజలు పాటు శివదీక్ష శిబిరాల్లో సిబ్బందికి ప్రత్యేక విధులను కేటాయించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.