close

మంగళవారం, జనవరి 28, 2020

ప్రధానాంశాలు

మేడారం

ప్రతిభకు పదును.. సృజనకు వెలుగు

ఎన్టీపీసీలో నేటి నుంచి జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన

జ్యోతినగర్‌, న్యూస్‌టుడే: విద్యార్థి తన ఆలోచనలు పదును పెట్టడానికి వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో చోటుచేసుకుంటున్న మార్పుల ఆధారంగా సృజనాత్మకతకు మెరుగులద్దడానికి ఇవి వేదికలుగా మారతాయి. ఇందులో భాగంగా రామగుండం ఎన్టీపీసీలోని టీటీఎస్‌ జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ‘సుస్థిర అభివృద్ధి కొరకు శాస్త్ర సాంకేతికత’ అంశంపై వివిధ ఉప అంశాలతో విద్యార్థులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ప్రదర్శనల్లో పాల్గొనదలిచే విద్యార్థుల ఎంట్రీలను గురువారం ప్రత్యేక కౌంటర్ల ద్వారా స్వీకరించారు. ఈ మేరకు ఏర్పాట్లను జిల్లా విద్యా శాఖాధికారి జగన్మోహన్‌రెడ్డి పరిశీలించారు.

సృజనాత్మకతకు పదును
విద్యార్థుల్లో విజ్ఞానం పెంచడానికి, వారిలోని సృజనాత్మకతకు పదును పెట్టడానికి ఈ ప్రదర్శనలు ఉపకరించనున్నాయి. విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రదర్శన మేళాను ఏర్పాటు చేశారు. వైజ్ఞానిక అంశాలతో పాటు చుట్టూ జరుగుతున్న అంశాలను ప్రదర్శించటంతో మరింత ఆసక్తి పెరగనుందని విద్యా శాఖ అధికారులు తెలిపారు.

మంత్రి చేతుల మీదుగా ప్రారంభం
శుక్రవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ వైజ్ఞానిక ప్రదర్శనలను ప్రారంభించనున్నారు. 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రదర్శనలను విద్యార్థులు తిలకించవచ్చు. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ప్రదర్శనలు తిలకించే అవకాశం ఉంది.

విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుల ప్రదర్శనలు
జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో దాదాపు 300 మందికి పైగా విద్యార్థులు ప్రయోగాలు ఏర్పాటు చేయనున్నారు. ఉపాధ్యాయులు, బీఈడీ, డీఈడీ శిక్షణ పొందుతున్న ఛాత్రోపాధ్యాయులు 6 ప్రదర్శనలు చేపట్టనున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్‌ బి.జగన్మోహన్‌రెడ్డి కన్వీనర్‌గా వ్యవహరిస్తుండగా, జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేన ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. కో-కన్వీనర్లుగా జిల్లా సైన్స్‌ అధికారి బి.రవినందన్‌రావు, మండల విద్యాధికారి బి.డేనియల్‌ వ్యవహరిస్తారు.

ఇవీ ఉప అంశాలు
* సుస్థిర వ్యవసాయ విధానం
* పరిశుభ్రత-ఆరోగ్యం
* వనరుల నిర్వహణ
* పారిశ్రామిక అభివృద్ధి
* భవిష్యత్తు రవాణా, సమాచార రంగం
* విద్యా విషయక ఆటలు, గణిత మోడలింగ్‌

పాల్గొనే విద్యార్థులు
* జూనియర్‌ విభాగంలో 6, 7 తరగతులు.
* సీనియర్‌ విభాగంలో 8వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.