close

మంగళవారం, జనవరి 28, 2020

ప్రధానాంశాలు

మండలానికి రెండు ప్రాథమిక సహకార కేంద్రాలు

జోగులాంబ గద్వాల జిల్లాలో 24

న్యూస్‌టుడే, ధరూరు

రైతుకు అందుబాటులో ఉండి వ్యవసాయ రుణసాయం అందించేందుకు సౌకర్యంగా ఉండటం కోసం పీఏసీఎస్‌లను ఏర్పాటు చేశారు. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో జోగులాంబ జిల్లా కొత్తగా ఏర్పడింది. జిల్లాలో మూడు కొత్త మండలాలు ఏర్పడ్డాయి. ప్రభుత్వం రైతులకు మరింత చేరువగా సహకార వ్యవస్థ ఉండాలన్న ఉద్దేశంతో సహకార కేంద్రాల విస్తరణకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా జోగులాంబ జిల్లాలో కూడా కొత్తగా ప్రాథమిక సహకార కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. సహకారం సంఘాల విస్తరణ కొత్త వాటి ఏర్పాటు కోసం వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.

అదనంగా 15 పీఏసీఎస్‌లు.. : జోగులాంబ గద్వాల జిల్లాలో గతంలో తొమ్మిది ప్రాథమిక సహకార కేంద్రాలు ఉన్నాయి. అప్పట్లో తొమ్మిది మండలాలు ఉండటం వల్ల మండలానికి ఒకటి చొప్పున కేంద్రాలున్నాయి. తాజాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి మండలంలో అదనంగా మరొకటి పీఏసీఎస్‌ ఏర్పాటు కానుంది. వాటితో పాటు కొత్తగా ఏర్పడిన రాజోలి, కేటీదొడ్డి, ఉండవెల్లి మండలాల్లో రెండు చొప్పున ప్రాథమిక సహకార కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం జిల్లాలో అన్ని సంఘాల్లో కలిపి 55వేల వరకు సభ్యులున్నారు. కొత్త మండలాలతో కలిపి 15 పీఏసీఎస్‌లు అదనంగా జిల్లాలో రైతులకు అందుబాటులోకి రానున్నాయి. మండలాల పరిధిలో ఏర్పాటైన సహకార సంఘం కేంద్రాల వారీగా సభ్యులను విభజించనున్నారు.

ఆశల పల్లకిలో నాయకులు..

పురపాలిక ఎన్నికల తర్వాత ప్రాథమిక సహకార ఎన్నికలు నిర్వహించనుండటంతో ఆశావహుల్లో ఆసక్తి నెలకొంది. గతంలో మండలానికి ఒక్కరికే సహకార సంఘం అధ్యక్షుడిగా పదవీ యోగం దక్కేది. ప్రభుత్వ నిర్ణయం వల్ల భవిష్యత్తులో అదనంగా మరో 15 మందికి సహకారం సంఘం పదవీ యోగం దక్కే అవకాశం ఉంది. రాజకీయంగా పదవులు దక్కని వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లుగా అంచనా వేసుకుంటున్నారు.

మార్గదర్శకాలు రాగానే..

ప్రభుత్వం మండలానికి రెండు పీఏసీఎస్‌ ఉండాలని నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి మార్గదర్శకాలు రాగానే సభ్యుల విభజన ప్రక్రియ ప్రారంభిస్తాం. ప్రభుత్వం ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సరే.. అన్నీ సిద్ధం చేసి ఉంచుతాం.

- ప్రసాదరావు, మేనేజర్‌, డీసీసీబీ

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.