close

బుధవారం, ఆగస్టు 12, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తిరుపతిలో లాక్‌డౌన్‌

18డివిజన్‌లలో అమలు

అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న కలెక్టర్‌ భరత్‌గుప్తా

తిరుపతి(నగరపాలిక), ఈనాడు డిజిటల్‌, తిరుపతి: నగరంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల ఉద్ధృతిని తగ్గించేందుకు జిల్లా పాలనాధికారి భరత్‌గుప్తా సోమవారం సమీక్షించి స్పష్టతను ఇచ్చారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం కలెక్టర్‌.. నగరపాలక సంస్థ కమిషనర్‌, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి కరోనా నియంత్రణ చర్యలపై అభిప్రాయ సేకరణ చేపట్టారు. నగరం మొత్తం సంపూర్ణ లాక్‌డౌన్‌కు తితిదే నుంచి వ్యతిరేకత వస్తుందని భావించిన అధికారులు తిరుమలకు వెళ్లే ప్రధాన రహదారులకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని తీర్మానించారు. నగరంలో 20 పాజిటివ్‌ కేసులు ఉన్న డివిజన్‌లలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేయాలని, పరిస్థితులను బట్టి వాటిని ఆనుకుని ఉన్న పొరుగు డివిజన్‌లలో కూడా లాక్‌డౌన్‌ విధించాలని కలెక్టర్‌ ఆదేశించారు. కంటైన్మెంట్‌ జోన్‌లుగా ప్రకటించిన వార్డుల్లో అన్ని రకాల దుకాణాలను మూసి వేయాలని, ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఉదయం రెండు మూడు గంటలు దుకాణాలు తెరిచేందుకు అనుమతించాలని ఆయన సూచించారు. కరోనా కేసుల సంఖ్య తగ్గే వరకు నగరంలోని అన్ని దుకాణాలు మధ్యాహ్నం 2 గంటల వరకే తెరవాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించి దుకాణాలు తెరిస్తే భారీ జరిమానాలు వసూలు చేయాలన్నారు. కంటైన్మెంట్‌ జోన్‌లుగా ప్రకటించిన వార్డుల్లో భవన నిర్మాణ పనులకు షరతులతో కూడిన అనుమతులు ఉంటాయన్నారు. 60 ఏళ్ల పైబడిన వారు, గర్భిణులు, 10 సంవత్సరాల లోపు చిన్నపిల్లలు బయట తిరగనివ్వవద్దని, మాస్కులు లేని వారి పట్ల కఠినంగా వ్యహరించాలని జిల్లా పాలనాధికారి ఆదేశించారు. సమావేశంలో కమిషనర్‌ గిరీష, జేసీ వీరబ్రహ్మం, అదనపు పోలీసు సూపరింటెండెంట్‌ సుప్రజ, అదనపు కమిషనర్‌ హరిత, ఉప కమిషనర్‌ చంద్రమౌళీశ్వరరెడ్డి, డీఎస్పీ మురళీకృష్ణ, ఇన్‌ఛార్జి ఎస్‌ఈ చంద్రశేఖర్‌, తహసీల్దార్‌ కిరణ్‌కుమార్‌, నగరి, పుత్తూరు పురపాలిక కమిషనర్లు పాల్గొన్నారు.

 

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.