close

ఆదివారం, ఫిబ్రవరి 23, 2020

ప్రధానాంశాలు

ఆడబిడ్డల ఆశీర్వాదంతో తెరాస విజయకేతనం
రైసస రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి
ఆశీర్వాదసభలో మాట్లాడుతున్న పల్లా రాజేశ్వరరెడ్ఢి

గద్వాల అర్బన్‌, న్యూస్‌టుడే : ఆడబిడ్డల ఆశీర్వాదమే గద్వాల పురపాలిక ఎన్నికల్లో తెరాస పార్టీ పురపాలికపై గులాబీ జెండాతో విజయకేతనం ఎగురవేయడం ఖాయమని రైసస రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. గద్వాల పురపాలిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాలలోని తేరుమైదానంలో ఆదివారం రాత్రి తెరాస ఆధ్వర్యాన మహిళా అశీర్వాద సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పల్లా రాజేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ప్రజల సంక్షేమానికి పలు పథకాలు అమల్లోకి తీసుకొచ్చారన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముభారక్‌, ఆసరా, రైతుబీమా, రైతుబంధు మొదలైన పథకాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. కేసీఆర్‌ పథకాలే నేడు జరిగే గద్వాల పురపాలిక ఎన్నికల్లో తెరాస తరఫున బరిలో నిలిచిన 37 మందిని గెలిపించబోతున్నాయన్నారు. ఇపుడు జరిగే ఎన్నికల్లో బీజేపీకి భయం పట్టుకుందని, అందుకే లోపాయికారిగా కాంగ్రెస్‌తో కుమ్మక్కయిందన్నారు. రాష్ట్రంలో 1000 స్థానాల్లో బీజేపీకి, 500 స్థానాల్లో కాంగ్రెస్‌కు అభ్యర్థులు కరువయ్యారన్నారు. గద్వాల పురపాలికను స్మార్ట్‌ సిటీగా మారుస్తామని బీజేపీ నేత డీకే అరుణ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గద్వాలలో మద్యం వ్యాపారం చేసే వారే మద్యపానాన్ని నిషేధించాలని రాష్ట్ర రాజధానిలో దీక్షలకు దిగడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎంపీ రాములు మాట్లాడుతూ అభివృద్ధి వేగవంతం చేయాలంటే తెరాస అభ్యర్థులను ఆశీర్వదించాలన్నారు. విద్యా, సాంకేతికపరంగా గద్వాల పురపాలిక అభివృద్ధి చెందేందుకు ఎంపీగా తన సహకారం ఉంటుందన్నారు. సీఎఫ్‌సీ ఛైర్మన్‌ గట్టు తిమ్మప్ప మాట్లాడుతూ.. మతతత్వ పార్టీలకు ప్రజలు పురపాలిక ఎన్నికల్లో గుణపాఠం చెబుతారన్నారు. తెరాస ఛైౖర్మన్‌ అభ్యర్థి బీఎస్‌ కేశవ్‌ మాట్లాడుతూ మంత్రిగా..ఎమ్మెల్యేగా పని చేసిన డీకే అరుణ గద్వాలను స్మార్ట్‌ సిటీగా ఎలా చేస్తుందోనని ప్రజలు ఆశ్చర్యపోతున్నారన్నారు. కార్యక్రమంలో రైసస జిల్లా అధ్యక్షుడు వెంకట్రాములు, కోడిగుడ్ల సలాంపాల్గొన్నారు.

సభకు హాజరైన మహిళలు

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.