close

ఆదివారం, సెప్టెంబర్ 20, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నేతలు.. స్ఫూర్తిప్రదాతలు

కర్నూలు, న్యూస్‌టుడే : దేశ స్వాతంత్య్రోద్యమం ఓ మహోజ్వల ఘట్టం.. స్వరాజ్య సాధన కోసం ఎందరో యోధులు పోరాటాలు చేసి అమరులయ్యారు.. ఆ త్యాగధనుల అలుపెరగని దీక్షా ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛాస్వాతంత్య్రం. అలాంటి మహానుభావులను స్మరించుకునేందుకు ఈనాడు ఇచ్చిన పిలుపునకు పలువురు స్పందించారు. వారికి నచ్చిన యోధుల గురించి రాసి పంపారు.

*ఏ దేశ చరిత్రలో అయినా వల్లభాయ్‌ పటేల్‌ లాంటి నాయకుడు ఉండటం చాలా అరుదు. ధృడమైన, ధైర్యమున్న నాయకుడైన పటేల్‌ లభించడం భారతదేశం అదృష్టం. స్వాతంత్య్ర పోరాటంలో అత్యంత క్రియాశీల పాత్ర పోషించి జాతికి స్ఫూర్తిగా నిలిచారు. సుస్థిరమైన ఐక్యత, అభివృద్ధి గల భారతదేశం కోసం కష్టపడి పనిచేశారు. - ఎ.నమ్రతా రెడ్డి, నంద్యాల

*దేశం కోసం.. సమాజ శ్రేయస్సు కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహానుభావుల్లో వావిలాల గోపాలకృష్ణయ్య ఒకరు. భరతమాత ముద్దుబిడ్డగా, దేశ సేవలో తరించిన ధన్యజీవి. వ్యక్తిగత, కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి బ్రిటీష్‌ వారిపై విప్లవ శంఖం పూరించిన సమరయోధుడు వావిలాల. గాంధీ పిలుపునిచ్చిన ఉద్యమాల్లో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు. - నాయకల్లు సతీశ్‌, కర్నూలు

*భారత స్వాతంత్య్ర ఉద్యమంలో భగత్‌సింగ్‌ నిప్పుకణం, దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం. ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అంటూ చేసిన నినాదం చరిత్రలో నిలిచిపోయింది. స్వాతంత్య్రం కోసం నవ్వుతూ ప్రాణాలు అర్పించిన మహానుభావుడు భగత్‌సింగ్‌. ఆయన చెప్పిన ‘నాయకత్వ లక్షణాలు, తక్కువగా మాట్లాడు ఎక్కువగా పనిచేయడం, గ్రంథాలు చదవటం’ ఇవన్నీ యువత స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. - బి.సాయి కల్యాణ్‌, ఆదోని

*భారత స్వాతంత్య్ర పోరాటాన్ని, గాంధీజీ జీవితాన్ని విడదీసి చూడలేం. ఈ ప్రపంచానికి సత్యాగ్రహం, అహింస అనే పదునైన ఆయుధాలను పరిచయం చేసిన మహానుభావుడు ఆయన. 20వ శతాబ్దంలో మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన నాయకుల్లో ముందువరుసలో నిలిచే మహానుభావుడు బాపూజీ. - ఎం. మీనాక్షి, డోన్‌

*భారత స్వాతంత్య్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు జరిపిన సాయుధ పోరాటం ఒక ప్రత్యేక అధ్యాయం. స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలను అర్పించిన యోధుడు. చిన్న వయసులోనే పరిమిత వనరులతో బ్రిటీష్‌ సామ్యాజ్యమనే మహాశక్తిని ఢీకొని తెలుగు జాతి ప్రజల్లో చిరస్మరణీయుడయ్యారు. - డి.చాంద్‌ బాషా, కర్నూలు

*చంద్రశేఖర్‌ ఆజాద్‌.. ఈ పేరు వింటే చాలు తెల్లదొరల గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఎక్కడ ఏ విధ్వంసానికి పథకం రచిస్తాడని బ్రిటీష్‌ వారు భయపడేవారు. అత్యంత పిన్నవయసులోనే దేశం కోసం తన జీవితాన్నే అర్పించి మహాపురుషుడిగా యోధుడిగా పేరు గాంచారు. అతని మిత్రులు క్విక్‌ సిల్వర్‌ అని పిలుచుకునేవారు. - వి.మనోజ్ఞ షైనీ, కర్నూలు

*విప్లవ చైతన్యానికి మారు పేరు.. భగత్‌ సింగ్‌. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారుల్లో ఈయన ఒకరు. అనేక విప్లవ సంస్థల్లో పనిచేశారు. ఆయన పోరాట స్ఫూర్తి స్వాతంత్య్ర సిద్ధికి పోరాడేలా భారత యువతను ప్రేరేపించింది. - కె.రబియ, ఎమ్మిగనూరు

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.