close

శనివారం, ఆగస్టు 08, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మంత్రి గారూ.. దృష్టి సారించరూ!

● ముందుకు సాగని ఐటీ పార్కు

● జిల్లా కేంద్రాల్లో చెరువులు, కుంటలు కబ్జా

● కొత్త పురాల్లో సిబ్బంది, నిధుల కొరత

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌

రాష్ట్ర పురపాలిక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సోమవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం కానున్నారు.. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, జిల్లా మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌ రెడ్డిలతోపాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.. పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్‌ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో పలు సమస్యలపై దృష్టి సారిస్తారన్న ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారు.

ఐటీ పార్కు పైలాన్‌ శంకుస్థాపనకు రెండేళ్లు.. : మహబూబ్‌నగర్‌ పట్టణ శివారులోని ఎదిరలో 371 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఐటీ పార్కు పైలాన్‌కు 2018 జులైలో కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. రెండేళ్లు పూర్తి అయినప్పటికి ఇప్పటి వరకు ఐటీ పార్కు స్థలంలో ఎలాంటి మౌలిక వసతులు కల్పించలేదు. భూసేకరణ పూర్తి అయినప్పటికీ పనులు ముందుకు సాగడం లేదు. ఇక్కడ ఐటీ పార్కు పూర్తయితే సుమారు 100 పరిశ్రమల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. స్థానికులకు ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఐటీ పార్కుకు నిధులు అవసరం. దీనిపై కేటీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

*● జిల్లా కేంద్రాల్లోని చెరువులు, కుంటలు కబ్జాలకు గురవుతున్నాయి. వర్షం పడితే వరద నీరు పోవడానికి అవకాశం లేకుండా కబ్జాలు చేస్తున్నారు. దీంతో వానాకాలంలో భారీ వర్షాలు పడితే పలు కాలనీలు, బస్తీలు నీట మునుగుతున్నాయి. చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురైతే భవిష్యత్తులో వరదనీటితో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొనే అవకాశం ఉంది. దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.


మహబూబ్‌నగర్‌ : కలెక్టరేట్‌లోని ఎక్స్‌పో ప్రదర్శనశాలలో ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్‌ వెంకట్‌రావు

*● ఉమ్మడి జిల్లాలో కొత్తగా 9 పురపాలికలు ఏర్పాటు అయ్యాయి. పాతవి 10 పురాలు ఉన్నాయి. కొత్త పురపాలికల్లో అధికారులు, సిబ్బంది లేక పట్టణాల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. కొత్త పురపాలికల్లో తహశీల్దార్లు, ఎంపీడీవోలు ఇన్‌ఛార్జి కమిషనర్లుగా ఉన్నారు. దీంతో పట్టణ అభివృద్ధిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు. కొత్త పురపాలికలకు ప్రత్యేక నిధులు అవసరం. ప్రధానంగా రోడ్లు, డ్రైనేజీ, పార్కులు, వీధి దీపాలు తదితర మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది. వీటిపై కేటీఆర్‌ ప్రధానంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.