close

శుక్రవారం, జులై 10, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హరితహారం మొక్కలు అగ్నికి ఆహుతి

పీపానాయక్‌తండాలో రహదారి వెంట కాలిపోయిన మొక్కలు

ఆత్మకూర్‌(ఎస్‌), న్యూస్‌టుడే: పీపానాయక్‌తండా పంచాయతీలో రహదారి వెంట నాటిన సుమారు 60 హరితహారం మొక్కలు అగ్నిప్రమాదంలో దగ్ధమయ్యాయి. మూడు రోజుల క్రితం ఓ రైతు తన వ్యవసాయ భూమికి మొక్కలు అడ్డువస్తున్నాయనే కారణంతో నిప్పుపెట్టినట్లు స్థానికులు ఆదివారం ఆరోపించారు. రహదారి వెంట మొక్కలు మూడు రోజులుగా కాలుతూనే ఉన్నా కనీస నివారణ చర్యలు తీసుకోలేదని అధికారులపై తండావాసులు మండిపడుతున్నారు. ఈ విషయంపై ఎంపీడీవో మల్సూర్‌నాయక్‌ మాట్లాడుతూ కాలిన మొక్క స్థానంలో నాలుగు మొక్కలను సదరు రైతుతో నాటిస్తామని చెప్పారు.

 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.