close

గురువారం, నవంబర్ 26, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎన్నిక ఎప్పుడో..?

నందికొండ కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు ఎదురుచూపు

నందికొండ పురపాలక సంఘం

నాగార్జునసాగర్‌, న్యూస్‌టుడే: నందికొండ పుర పాలకవర్గం కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ఎప్పుడు జరుగుతుందోనని అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. నందికొండ పురపాలక సంఘం కౌన్సిలర్ల ఎన్నిక ఈ ఏడాది జనవరిలో జరిగింది. కౌన్సిలర్లతోపాటు కో-ఆప్షన్‌ సభ్యులు కూడా ఉండాలి. ఇందుకు పాలకవర్గంలో నలుగురు కో-ఆప్షన్‌ సభ్యులలో ఇద్దరు మేధావి వర్గం, మరో ఇద్దరు మైనార్టీ సభ్యులను ఎన్నుకోవాలి. ఈ ఎన్నికకు జులై 7న ప్రకటన జారీచేసి ఆగస్టు 2న చివరి తేదీగా నిర్ణయించారు. మొత్తం నలుగురు కో-ఆప్షన్‌ సభ్యులకుగానూ మొత్తం 18 మంది సభ్యులు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం ప్రకటన తేదీ నుంచి మూడురోజుల్లో మున్సిపల్‌ కమిషనర్‌ దరఖాస్తు వివరాల నివేదికను ఛైర్మన్‌కు అందజేయాలి. అనంతరం ఛైర్మన్‌ 15 రోజుల్లో కో-ఆప్షన్‌ సభ్యులను నామినేటెడ్‌ చేయాలి. ఇక్కడ కో-ఆప్షన్‌ ఎన్నిక నోటిఫికేషన్‌ వచ్చిన వెంటనే మున్సిపల్‌ కమిషనర్‌ అనారోగ్యం బారిన పడటంతో ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది. త్వరగా ఎన్నిక ప్రక్రియ నిర్వహించాలని అభ్యర్థులు కోరుతున్నారు.

నివేదిక అందజేశాం

- పల్లారావు, మున్సిపల్‌ కమిషనర్‌, నందికొండ

నందికొండ పురపాలక సంఘం కో-ఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు సంబంధించిన వివరాల నివేదికను ఛైర్‌పర్సన్‌కు అందజేశాం. త్వరలో ఎన్నిక ప్రక్రియను నిర్వహిస్తాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.