close

గురువారం, జులై 09, 2020

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టిన్నర్‌ తాగి చెరువులో పడి యువకుడి మృతి

నెల్లూరు (వీఆర్సీ సెంటరు), న్యూస్‌టుడే: మత్తు కోసం టిన్నర్‌ తాగి ఓ యువకుడు చెరువులో పడి మృతి చెందాడు. మూడు రోజుల తర్వాత మృతదేహం బయట పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మన్సూర్‌ నగర్‌కు చెందిన నాగేంద్ర (22) చికెన్‌ దుకాణంలో పనిచేసేవాడు. ఈ నెల 26న రాత్రి నిద్రపోయేందుకు స్నేహితులతో కలిసి స్వర్ణాల చెరువు వద్దకు వెళ్లాడు. మత్తు కోసం టిన్నర్‌ తాగి చెరువులోకి వెళ్లిపోయాడు. ఇక అంతే బయటకు రాలేదు. ఈ క్రమంలో శుక్రవారం చెరువులో మృతదేహం బయటకు పడగా స్థానికులు గుర్తించి దర్గామిట్ట పోలీసులకు సమాచారం అందించారు. దర్గామిట్ట ఎస్సై నాగభూషణం పరిశీలించారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.