close

శుక్రవారం, అక్టోబర్ 18, 2019

తాజా వార్తలు

పారిశుద్ధ్యం నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

పరిగి: గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగు పడే విధంగా గ్రామ కార్యదర్శులు, సర్పంచులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ అయిషా మస్రత్‌ ఖానం అన్నారు. బుధవారం పరిగి మండలం బర్కత్‌పల్లి ,నస్కల్‌, చిట్యాల, యాబాజీగూడ, గ్రామాల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో పరిశుభ్రత లోపించిందని అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇళ్ల మధ్య ఉన్న చెత్తను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని ప్రజలకు సూచించారు. పంచాయతీ చట్టం కఠినంగా ఉందని ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఆమెవెంట ఎండీవో కృష్ణకుమార్, ఈవోపీఆర్డీ దయానంద్‌, ఆయా గ్రామాలకు చెదిన గ్రామకార్యదర్శులు, వీఆర్వోలు ఉన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.