close

ఆదివారం, అక్టోబర్ 20, 2019

తాజా వార్తలు

ముఖ్యమంత్రి పర్యటన సాగింది ఇలా...


పురపాలక కార్యాలయంలో వరద చిత్రాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: నంద్యాలలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి పర్యటన సుమారు రెండు గంటలపాటు కొనసాగింది. శనివారం మధ్నాహ్నం 1.20 గంటలకు ఆయన పట్టణంలో ఏరియల్‌ వ్యూ చేశారు. ఆ తర్వాత 1.30 గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో హెలికాప్టర్‌ ల్యాండైంది. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, కార్మిక శాఖ మంత్రి జయరాంలతోపాటు ఎంపీ పోచా బ్రహ్మానందారెడ్డి, కలెక్టర్‌ వీరపాండియన్‌, జేసీ రవి పట్టన్‌శెట్టి, ఎస్పీ ఫక్కీరప్ప, సంయుక్త కలెక్టర్‌-2 ఖాజా మోహిద్దీన్‌, ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి, చక్రపాణిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, రాంరెడ్డి, కంగాటి శ్రీదేవి, హఫీజ్‌ఖాన్‌, గంగుల బ్రిజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ ప్రభాకర్‌రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి రహదారి మార్గంలో 1.48 గంటలకు పురపాలక కార్యాలయానికి చేరుకున్నారు.

● 1:49 గంటలకు పురపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన వరద ఛాయాచిత్రాలను తిలకించారు. ● 1:56 గంటలకు మున్సిపల్‌ కార్యాలయంలోని సమావేశ మందిరానికి చేరుకున్నారు. ● 1:58 గంటలకు వరదలు, నష్టపరిహారంపై జిల్లా అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం ప్రారంభించారు. ● 2:47 గంటలకు సమీక్షా సమావేశం ముగించారు. ● 2:50 గంటలకు మున్సిపల్‌ కార్యాలయంలోని స్పెషల్‌ ఆఫీసర్‌ గదికి చేరుకున్నారు. అక్కడే భోజనం చేశారు. ● 3:18 గంటలకు మున్సిపల్‌ కార్యాలయం బయటకు చేరుకున్నారు. ● 3:19 గంటలకు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, ఉద్యోగ తదితర సంఘాల నాయకుల నుంచి వినతిపత్రాలు తీసుకున్నారు.● 3:27 గంటలకు కాన్వాయ్‌ కదిలింది.

● 3:30 గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని హెలిప్యాడ్‌ చేరుకున్నారు.

● 3:35 గంటలకు మంత్రులు, అధికారులు, పార్టీ నాయకుల నుంచి వీడ్కోలు తీసుకుని తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

అధికారుల చర్యలతో దిగివచ్చిన వ్యాపారులు

టమోటాలు కొనుగోలు చేస్తామని చెప్పి శుక్రవారం సాయంత్రానికి మొహం చాటేసిన వ్యాపారులు అధికారుల చర్యలతో దిగి వచ్చారు. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి జగన్‌ పత్తికొండ మార్కెట్‌ సమస్యపై స్పందించారు. రైతులను పడిగాపులు కాసేలా చేసి వారి సహనానికి పరీక్ష పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్‌ శాఖ ఆర్జేడీ సుధాకర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పాటు శనివారం ఉదయం కల్లా మార్కెట్‌ యార్డులో కొనుగోలు చేసేందుకు రాకపోతే మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలోనే కొనుగోలు చేసి రైతు బజార్లకు సరకును తరలిస్తామని తేల్చి చెప్పటంతో వ్యాపారులు ఉదయం 10కల్లా మార్కెట్‌ యార్డుకు చేరుకున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకే సరకును కొనుగోలు చేస్తామని చెప్పి వేలం ప్రారంభించారు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.