close

సోమవారం, ఆగస్టు 26, 2019

తాజా వార్తలు

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

అమిస్తాపూర్‌ (భూత్పూర్‌), న్యూస్‌టుడే : విద్యుదాఘాతంతో అమిస్తాపూర్‌లో వ్యక్తి మృతి చెందాడు. భూత్పూర్‌ ఎస్‌ఐ పర్వతాలు కథనం మేరకు.. వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల మండలం మందిపాడుకు చెందిన వీరసముద్రం రాజు (26) భార్య స్వాతితో కలిసి స్థానిక గిరిధారి వెంచర్‌లో కూలీగా పనిచేస్తూ ప్రాంగణంలోని ఓ చిన్నగుడిసెలో నివాసం ఉంటున్నారు. రెండు రోజుల కిందట సొంత గ్రామానికి వెళ్లిన వారు మంగళవారం పనిలోకి వచ్చారు. ఉదయం గుడిసెపై నిలిచిన వర్షం నీళ్లు తొలగించే క్రమంలో గుడిసెకు విద్యుత్‌ సరఫరా చేసే తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటనపై భార్య స్వాతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.