ఇంటిపై నిఘా

పిల్లలెప్పుడూ అల్లరి చేస్తుంటారు. నిరంతరం వారి గదిపై ఓ కన్నేసి ఉంచడం కాస్త కష్టమే. బెడ్రూంలో ఉంటాం. ఇంటికి ఎవరొచ్చారో తెలుసుకునేందుకు హాల్‌కి రావాల్సిందే. ఇప్పుడలాంటి ఇబ్బందులు పడనవసరంలేదు. వ్యక్తిగత సెక్యూరిటీ కెమెరాలను అమర్చుకుంటే సరి. తక్కువ ధరలో ఎంఐ, వైఐ వంటి కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. సెటప్ చేసుకోవటానికి పెద్ద కష్టమూ పడనక్కర్లేదు. ఖర్చూ తక్కువే. మీ స్మార్ట్ ఫోన్లో లైవ్‌స్ట్రీమ్ చూసుకోవచ్ఛు మెమరీ కార్డులో రికార్డు చేసుకోవచ్చు కూడా. వాటిల్లో ‘బ్లింక్ ఎక్స్‌టీ2’ ఒకటి. ఇంట్లో, బయట సులభంగా ఇన్స్టాల్ చేసుకునేలా వీటిని తీర్చిదిద్దారు.
|