
ప్రత్యేక కథనం
తక్కువ రుసుములున్న అమెరికా వర్సిటీలనే ఎంచుకుంటున్న తెలుగు విద్యార్థులు
భవిష్యత్తులో సమస్యలు తప్పవంటున్న నిపుణులు
ఈనాడు - హైదరాబాద్
అమెరికాలోని అధిక శాతం విశ్వవిద్యాలయాలు పీజీ కోర్సుల్లో ప్రవేశానికి జీఆర్ఈ స్కోర్ తప్పనిసరి చేసినా ఆ స్కోర్ అడగని విద్యా సంస్థల్లోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. చాలా మంది విద్యార్థులు జీఆర్ఈ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు పొందినా అమెరికా వెళ్లిన తర్వాత ఆర్థిక భారాన్ని తప్పించుకునేందుకు ఇతర విశ్వవిద్యాలయాలకు మారిపోతున్నారు. మొత్తానికి అధిక శాతం మంది తెలుగు విద్యార్థులు నాణ్యమైన విద్యను అందించే వాటిని కాకుండా తక్కువ రుసుములున్న వాటిని ఎంచుకుంటున్నారని, దీనివల్ల మున్ముందు మరిన్ని సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గ్రాడ్యుయేట్ రికార్డు ఎగ్జామ్ (జీఆర్ఈ)లో వచ్చిన స్కోర్ ఆధారంగా అమెరికాలోని అధిక విశ్వవిద్యాలయాలు ప్రవేశాలు కల్పిస్తాయి. మంచి విద్యాసంస్థలు ఎక్కువ స్కోర్ అడుగుతాయి. సాధారణంగా జీఆర్ఈలో మొత్తం 340 స్కోర్‌కు 300 దాటితేనే మంచి వర్సిటీలు సీటు ఇచ్చేందుకు సంసిద్ధత పత్రం(ఐ-20) పంపిస్తాయి. దాదాపు 90 శాతం మందికి స్కోర్ 300 మించడం లేదు. ఆ స్కోర్ 300 దాటితే మంచి వర్సిటీల్లో, 310 స్కోర్ దాటితే ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో సీటు లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో 4800 వరకు ఉన్నత విద్యను అందించే విద్యాసంస్థలు ఉన్నా వాటిల్లో 1700లకు పైగా సంస్థలు మాత్రమే మాస్టర్ డిగ్రీ(రెండేళ్ల పీజీ) కోర్సులను అందిస్తున్నాయి. వాటిల్లో 80-90 శాతం విశ్వవిద్యాలయాల్లో చేరాలంటే జీఆర్ఈ స్కోర్ అవసరం.
ఉత్తమ వర్సిటీల్లో అధిక రుసుములు
మంచి స్కోర్ సాధిస్తే ఉత్తమ వర్సిటీల్లో ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉన్నా అక్కడ బోధనా రుసుములు(ట్యూషన్ ఫీ) అధికంగా ఉంటాయి. దాంతో కొందరు మంచి స్కోర్ దక్కించుకున్నా ఆర్థిక వెసులుబాటు కోసం తక్కువ రుసుములున్న వాటిల్లో చేరేందుకు మొగ్గుచూపుతున్నారని నిపుణులు చెబుతున్నారు. మరో వైపు కొన్ని కన్సల్టెన్సీలు విద్యార్థులకు మంచి వర్సిటీల్లో చేరాలని చెప్పకుండా తమకు ఒప్పందం ఉన్న వాటిల్లో చేరాలని సూచిస్తున్నాయి. జీఆర్ఈ అవసరం లేదని వారే చెబుతున్నారు. ఫలితంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎక్కువ మంది ఉత్తమ వర్సిటీలకు దూరంగా ఉంటున్నారు.
అమెరికన్ కార్నర్‌ను వినియోగించుకునే వారేరీ!
అమెరికా కాన్సులేట్ నాలుగేళ్ల క్రితమే హైదరాబాద్ నగరంలోని బేగంపేటలో సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల ప్రాంగణంలో అమెరికన్ కార్నర్ పేరిట విద్యార్థుల కోసం ఒక విభాగాన్ని నెలకొల్పింది. అమెరికాలోని వివిధ విద్యాసంస్థలకు చెందిన డీవీడీలు, పుస్తకాలు, పత్రికలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మంగళవారం నుంచి శనివారం వరకు (మధ్యాహ్నం 3 గంటలు- రాత్రి 7గంటల) దీనిని ఎవరైనా సందర్శించవచ్చు. ఈ కేంద్రంలో ప్రతి గురువారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు అమెరికా విద్య, ఇతర సందేహాలను నివృత్తి చేయడానికి నిపుణులు అందుబాటులో ఉంటారు. అయితే, ఈ అవకాశాన్ని చాలా తక్కువ మంది విద్యార్థులు వినియోగించుకుంటున్నారని అమెరికన్ కార్నర్ వర్గాలు తెలిపాయి.
రుసుములు ఎక్కువైనా అధిక ప్రయోజనం మంచి విద్యాసంస్థల్లో బోధనా రుసుములు ఎక్కువ ఉండొచ్చు. అయితే చదువులో ప్రతిభ చూపితే![]() - ఉడుముల వెంకటేశ్వర్‌రెడ్డి, వరల్డ్ వైడ్ ఎడ్యు కన్సల్టెన్సీ, గుంటూరు
|
అక్కడికెళ్లి మారుతున్నారు ప్రతి ఏటా జీఆర్ఈ రాసే వాళ్లలో, ఆ స్కోర్‌తో ప్రవేశాలు పొందేవారిలో భారత్ నుంచి ఎక్కువ మంది ఉంటున్నారు. చదువులో మార్కులు బాగుంటే జీఆర్ఈ స్కోర్ తక్కువ ఉన్నా ప్రవేశాలు ఇస్తారు. అయితే జీఆర్ఈ స్కోర్‌తో అక్కడికి వెళ్లినా...సెమిస్టర్ పూర్తయిన తర్వాత తక్కువ రుసుములుండే విశ్వవిద్యాలయాల్లోకి మారిపోతున్నారు. దానివల్లే సమస్యలు వస్తున్నాయి. - గణేశ్, వాల్మీకి కన్సల్టెన్సీ నిర్వాహకుడు, హైదరాబాద్ |
మరిన్ని

దేవతార్చన
- 20న వేటూరి విగ్రహావిష్కరణ
- భైంసాలో విషాదం.. 500 మందికి అస్వస్థత
- ఆశ్చర్యపరుస్తున్న వింత చేప
- డబ్బుపోయిందంటూ అసెంబ్లీలో ఎమ్మెల్యే రోదన
- భారీగా ఎర్రచందనం స్వాధీనం
- 15 అడుగుల బొంగు చికెన్ తయారీ
- శ్రీశైలానికి.. దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెస్తాం
- చట్ట వ్యతిరేక పనులను ఉపేక్షించం: కాగ్నిజెంట్
- ఉపరాష్ట్రపతి రాకకు రైల్వేస్టేషన్ ముస్తాబు
- జనంపైకి దూసుకెళ్లిన ట్రక్కు: 13మంది మృతి