close

తాజా వార్తలు

‘ఓటింగ్‌శాతం చివర్లో అమాంతం ఎలా పెరిగింది?’

దీనిపై సీఈవోను ఆరా తీశాం: ధర్మపురి అర్వింద్‌

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ఈవీఎంలు స్ట్రాంగ్‌ రూమ్‌కు ఆలస్యంగా చేరాయని.. ఉపయోగించని ఈవీఎంలకు రెండు రోజుల తర్వాత సీల్ వేస్తున్నారని నిజామాబాద్ లోక్‌సభ భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ను కలిసి ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం అర్వింద్‌ మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్‌లో 185 మంది అభ్యర్థులు పోటీలో నిలవడం చాలా పెద్ద విషయమన్నారు. ఓటింగ్‌ శాతం చివరిగంటలో అమాంతం ఎందుకు పెరిగిపోయిందని సీఈవోను ఆరా తీశామని చెప్పారు. ఎన్నికలకు సంబంధించి తమకు ఉన్న కొన్ని అనుమానాలను నివృత్తి చేసుకునేందుకే  ఆయనను కలిసినట్లు అర్వింద్‌ చెప్పారు. ఓట్ల లెక్కింపు సమయంలో ఏదైనా ఇబ్బంది తలెత్తితే మళ్లీ లెక్కించాలని కోరినట్లు తెలిపారు. స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద భద్రతపై సీఈవో వద్ద ప్రస్తావించానని.. అక్కడ కేంద్ర బలగాలు ఉంటున్నందున ఎలాంటి ఇబ్బందీ లేదని చెప్పారన్నారు. వీటన్నింటిపై సమాచారహక్కు చట్టం ద్వారా వివరాలు కోరామని అర్వింద్‌ తెలిపారు.



మరిన్ని

ఎన్నికల షెడ్యూల్

లోక్‌సభ మూడో ద‌శ‌ ఎన్నికలు
(14 రాష్ట్రాల్లో - 115 స్థానాలు)
షెడ్యూల్‌ ప్రకటన 10-03-2019
నోటిఫికేషన్ 28-03-2019
నామినేషన్ల గడువు 04-04-2019
నామినేషన్ల పరిశీలన 05-04-2019
ఉపసంహరణ 08-04-2019
పోలింగ్ తేదీ 23-04-2019
ఓట్లు లెక్కింపు 23-05-2019
పూర్తి షెడ్యూల్

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net