అల్లరి ఏనుగుపిల్ల.. ! వైరల్ వీడియో

తాజా వార్తలు

Updated : 03/09/2020 12:04 IST

అల్లరి ఏనుగుపిల్ల.. ! వైరల్ వీడియో

ఇంటర్నెట్‌ డెస్క్‌: జంతువుల్లో ఏనుగు చాలా బుద్ధిశాలి అంటారు. మనుషుల్లాగే ఇవి తమ కుటుంబాన్ని చాలా ప్రేమిస్తాయట. కాగా, ఓ బుల్లి ఏనుగుకు సంబంధించిన వీడియోలు తాజాగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. రెండు నెలల వయస్సు గల ఓ గున్నఏనుగు చిన్న రబ్బరు స్విమ్మింగ్‌ పూల్‌లో ఉన్న నీటితో హాయిగా ఆడుకుంటున్న దృశ్యం ఈ వీడియోలో ఉంది. కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థలలో ఉన్న ప్రముఖ  శ్రీ మంజునాథ స్వామి దేవస్థానం, దీనికి శివాని అని నామకరణం చేసింది. అనంతరం శివాని నీటితో ఆడుతున్న దృశ్యాన్ని వీడియో తీసి నెట్టింట్లో ఉంచారు. కాగా శివానికి నీటిలో ఆడుకోవటం అంటే చాలా ఇష్టమట. ఆ బుల్లి ఏనుగు అల్లరికి మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేశ్‌తో సహా పలువురు నెటిజన్లు ఫిదా అయ్యారు. ‘‘వావ్‌.. ఎంత ముద్దుగా ఉందో, అల్లరి పిల్ల, సో క్యూట్ ‌..’’ అంటూ తెగ లైక్‌లు, కామెంట్లు చేస్తున్నారు. ఇంకెదుకాలస్యం.. ఆ వీడియోలను మీరూ చూడండి మరి!
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని