అంబులెన్స్‌కు దారిచ్చిన సీఎం జగన్‌ కాన్వాయ్‌

తాజా వార్తలు

Published : 02/09/2020 20:52 IST

అంబులెన్స్‌కు దారిచ్చిన సీఎం జగన్‌ కాన్వాయ్‌

అమరావతి: ఏపీ సీఎం జగన్‌ మరోసారి తన మానవత్వాన్ని  చాటుకున్నారు. కడప జిల్లా పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న అనంతరం మార్గమధ్యంలో సీఎం కాన్వాయ్‌ వేగం తగ్గించి అంబులెన్స్‌కు దారి ఇచ్చింది. జగన్‌ కాన్వాయ్‌ గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్తుండగా గూడవల్లి-నిడమానూరు వద్ద జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వ్యక్తిని అత్యవసరంగా ఆస్పత్రికి తరలించాల్సి రావడంతో సీఎం కాన్వాయ్‌ కొద్దిగా వేగం తగ్గించుకుని అంబులెన్స్‌కు దారిచ్చింది. 

ఉయ్యూరు నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి గన్నవరం వద్ద ప్రమాదానికి గురయ్యాడు. ఆయన్ను ఎన్‌హెచ్‌ఏఐకు చెందిన అంబులెన్స్‌లో విజయవాడలోని ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు. అదే సమయంలో జగన్‌ కాన్వాయ్‌ వెళ్తుండటంతో ముందుగా అంబులెన్స్‌కు దారివ్వాలని సీఎం తన సిబ్బందికి సూచించారు. సీఎం సూచనలతో కాన్వాయ్‌ వేగాన్ని తగ్గించి అంబులెన్స్‌కు దారిచ్చారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని