వధువుకు కరోనా.. ఏం చేశారంటే..

తాజా వార్తలు

Updated : 07/12/2020 12:09 IST

వధువుకు కరోనా.. ఏం చేశారంటే..

జైపుర్‌: కరోనా మహమ్మారి అన్నింటిపైనా ప్రభావం చూపిస్తోంది. కొవిడ్‌తో పెళ్లి తతంగం రూపురేఖలే మారిపోయాయి. మరికొద్ది గంటల్లో వివాహం ఉందనగా వధువుకు పాజిటివ్‌గా తేలడంతో పీపీఈ కిట్లు ధరించే పెళ్లి తంతును ముగించేశారు. వధూవరులతో పాటు మరో ముగ్గురు మాత్రమే ఈ వివాహంలో పాల్గొనడం గమనార్హం.

రాజస్థాన్‌లోని షాహాబాద్‌ జిల్లాకు చెందిన యువతికి డిసెంబర్‌ 6న పెళ్లి నిశ్చయమైంది. అయితే వివాహానికి కొద్ది గంటల ముందు వధువుకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే పెద్దలు పెళ్లిని వాయిదా వేయాలనుకోలేదు. పురోహితుడు మంత్రాలు చదువుతుండగా పీపీఈ కిట్లు ధరించిన వధూవరులు దండలు మార్చుకొని ఒక్కటయ్యారు. పురోహితుడితోపాటు పెళ్లికి హాజరైన ఇంటి పెద్దలు కూడా పీపీఈ కిట్లు ధరించి పెళ్లి తంతుని కానిచ్చేశారు.

ఇవీ చదవండి..

4లక్షల దిగువకు క్రియాశీల కేసులు

ఆక్స్‌ఫర్డ్‌ టీకాకు అనుమతి ఇవ్వండి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని