నిబంధనలు ప్రకారమే రిజర్వు జాబితా: UPSC
close

తాజా వార్తలు

Published : 07/08/2020 03:03 IST

నిబంధనలు ప్రకారమే రిజర్వు జాబితా: UPSC

ఇంటర్నెట్‌ డెస్క్‌: 2019 సివిల్‌ సర్వీస్‌ పరీక్ష ఫలితాలపై యూనియన్‌ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) వివరణ ఇచ్చింది. సివిల్‌ సర్వీస్‌ పరీక్ష ఫలితాల ద్వారా ప్రభుత్వం భర్తీ చేయదల్చుకున్న ఖాళీల కంటే తక్కువ సంఖ్యలో అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఖండించింది. ఈ పరీక్షలో 927 ఖాళీలకు గాను 829 మంది అభ్యర్థుల ఫలితాలను ప్రకటించామన్న సర్వీస్‌ కమిషన్..  సివిల్‌ సర్వీస్‌ నిబంధనలకు అనుగుణంగానే రిజర్వు జాబితాను నిర్వహించినట్లు స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం నిర్దేశించిన పరీక్ష నిబంధనలను కమిషన్‌ తూచ తప్పకుండా అనుసరిస్తున్నట్లు పేర్కొంది. 927 ఖాళీల కోసం తొలివిడతగా 829 మంది అభ్యర్థుల ఫలితాలను ప్రకటించామన్న యూపీఎస్సీ.. నిబంధనల ప్రకారమే రిజర్వు జాబితాను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఓపెన్‌ కేటగిరీలో ఎంపికైన రిజర్వు కేటగిరీ అభ్యర్థులు తమకు ఇష్టముంటే రిజర్వు స్టేటస్‌ ఆధారంగా సర్వీసులను ఎంపిక చేసుకోవచ్చు. ఇలా ఎంచుకున్నప్పుడు తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు యూపీఎస్సీ రిజర్వు జాబితాను పక్కకు పెడుతోంది. ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత రిజర్వు జాబితాలోని అభ్యర్థులను తిరిగి ప్రకటిస్తుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని