నానమ్మ మరణించిన గంటల వ్యవధిలోనే..!

తాజా వార్తలు

Published : 29/08/2020 15:16 IST

నానమ్మ మరణించిన గంటల వ్యవధిలోనే..!

ఎస్‌.కోట: విజయనగరం జిల్లా ఎస్‌.కోట పట్టణంలోని గౌరీశంకర్‌ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. నానమ్మ మరణించిన గంటల వ్యవధిలోనే మనవడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వి.కాసులమ్మ(90) అనే వృద్ధురాలు అనారోగ్యంతో శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందింది. అదే ఇంట్లో ఉంటున్న ఆమె మనవడు వీరాచారి (45) కూడా ఆమె మృతదేహం పక్కనే ఏడుస్తూ ఇవాళ ఉదయం మృతి చెందాడు. అతడికి పుట్టుకతోనే మూగ, చెవుడు. అదే ఇంట్లో ఉంటున్న వృద్ధురాలి మరో మనవడు ఆనంద్‌ జ్వరంతో బాధపడుతున్నాడు. ఒకే ఇంట్లో ఇద్దరు వ్యక్తులు మరణించినప్పటికీ.. కరోనా భయంతో బంధువులెవరూ అక్కడికి వెళ్లేందుకు సాహసించలేదు. అంత్యక్రియలు నిర్వహించడానికి ఎవరూ ముందుకు రావడం లేదని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని