AP News: భూ స‌ర్వేను ప‌రుగులు పెట్టించాలి: జ‌గ‌న్

తాజా వార్తలు

Published : 02/06/2021 15:43 IST

AP News: భూ స‌ర్వేను ప‌రుగులు పెట్టించాలి: జ‌గ‌న్

అమ‌రావ‌తి: ‘జ‌గ‌న‌న్న శాశ్వ‌త భూహ‌క్కు - భూ ర‌క్ష స‌ర్వే’ ఆల‌స్యం కాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. భూ స‌ర్వేపై ఇవాళ స‌మీక్ష నిర్వహించిన జ‌గ‌న్‌.. కొవిడ్ పరిస్థితుల వ‌ల్ల మంద‌గ‌మ‌నంలో ఉన్న ఈ పథ‌కాన్ని ప‌రుగులు పెట్టించాల‌ని సూచించారు. నిర్దేశించిన స‌మ‌యంలోగా ల‌క్ష్యాన్ని చేరాల‌న్నారు. స‌ర్వేను పూర్తి చేయ‌డానికి అధికారులు స‌మ‌న్వ‌యంతో ముందుకు సాగుతూ.. అంకిత‌భావంతో ప‌ని చేయాల‌ని సూచించారు.

మారుమూల ప్రాంతాల్లో సర్వేకు సిగ్న‌ల్స్‌ అందక సాంకేతిక స‌మ‌స్య‌లు ఉంటాయ‌న్న సీఎం.. ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల‌న్నారు. ప్ర‌జ‌ల‌కు అన్ని ర‌కాల సేవ‌లు అందించేలా గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల సిబ్బంది సిద్దం కావాల‌ని జ‌గ‌న్ సూచించారు. ప్ర‌స్తుతం అందిస్తున్న జ‌న‌న‌, మ‌ర‌ణ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల్లాగే అన్ని ర‌కాల స‌ర్టిఫికెట్లు ప్ర‌జ‌ల‌కు స‌చివాల‌యాల్లోనే అందేలా చూడాల‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. స‌ర్వే సిబ్బందికి శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల మాన్యువ‌ల్‌ను డౌన్‌లౌడ్ చేసుకునేలా డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంచాల‌న్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని