AP News: CMRF నుంచి డాక్టర్‌ భాస్కర్‌రావుకు సాయం

తాజా వార్తలు

Updated : 06/06/2021 15:47 IST

AP News: CMRF నుంచి డాక్టర్‌ భాస్కర్‌రావుకు సాయం

వెల్లడించిన ఏపీ మంత్రి ఆళ్ల నాని

అమ‌రావ‌తి: ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్‌సీ వైద్యుడు డాక్టర్‌ ఎన్‌.భాస్కర్‌రావు చికిత్సకు సీఎం సహాయనిధి నుంచి సాయం చేస్తున్నట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. చికిత్సకు అవసరమైన రూ.1.5కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. కరోనా బారిన పడిన భాస్కర్‌రావుకు ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్‌ కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల మార్పిడి చికిత్సకు రూ.1.5కోట్లు ఖర్చు అవుతుందని వైద్య నిపుణులు చెప్పడంతో ఈ విషయాన్ని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం.. భాస్కర్‌రావు చికిత్సకు నిధులు మంజూరు చేయాలని ఆదేశించారు.

హెల్ప్ డెస్క్‌ల ప‌నితీరుపై ఆరా

ఏపీలోని కొవిడ్ ఆస్ప‌త్రుల హెల్ప్ డెస్కుల ప‌నితీరుపై వైద్యారోగ్య‌శాఖ మంత్రి ఆళ్ల‌నాని ప్ర‌త్యేక దృష్టి పెట్టారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా హెల్ప్ డెస్కుల్లో స‌మాచారం అంద‌డం లేదంటూ సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాల‌పై మంత్రి ఆరా తీశారు. జిల్లా యంత్రాంగం, డీఎంహెచ్‌వో, డీసీహెచ్ఎస్ సూప‌రింటెండెంట్‌ల‌తో మొబైల్ కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మీక్షించారు. జిల్లాలోని అన్ని కొవిడ్ ఆస్ప‌త్రుల్లో ఉన్న హెల్ప్ డెస్క్‌లు కొవిడ్ బాధితుల‌కు అవ‌స‌ర‌మైన సమాచారం మ‌రింత క‌చ్చితంగా ఇవ్వ‌డానికి జిల్లా యంత్రాంగం కృషి చేయాల‌ని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 24 గంట‌ల పాటు కొవిడ్ ఆస్పత్రుల్లో షిఫ్ట్ ప‌ద్ధ‌తిలో సిబ్బందిని నియ‌మించాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని