సోనూసూద్‌కు చంద్రబాబు అభినందన
close

తాజా వార్తలు

Updated : 26/07/2020 22:34 IST

సోనూసూద్‌కు చంద్రబాబు అభినందన

రైతు కుమార్తెల చదువు బాధ్యత తెదేపాదేనని హామీ

అమరావతి: చిత్తూరు జిల్లా మహల్‌రాజపల్లిలో రైతు నాగేశ్వరరావు తన కుమార్తెలతో పొలం దున్నిస్తున్న వీడియో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. వీడియో చూసిన నటుడు సోనూసూద్‌ చలించి వారికి ట్రాక్టర్‌ను అందజేశాడు. సోనూసూద్‌ చేసిన సాయాన్ని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. సోనూసూద్‌ సాయం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. అంతేకాదు రైతు నాగేశ్వరరావు కుమార్తెల చదువుల బాధ్యత తెదేపా తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.

చంద్రబాబు మాటలు మరింత స్ఫూర్తినిస్తాయి: సోనూ

రైతు నాగేశ్వరరావుకు సాయంపై చంద్రబాబు ఫోన్‌ చేసి అభినందించడంతో సోనూసూద్‌ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు మాటలు తన కార్యక్రమాలకు మరింత స్ఫూర్తినిస్తాయని, మరికొంత మందికి సాయం చేసేందుకు తోడ్పాటునిస్తాయని సోనూసూద్‌ అన్నారు. త్వరలో చంద్రబాబును కలుస్తానని చెప్పారు. 

రైతు నాగేశ్వరరావు వీడియో చూసిన వెంటనే సోనూసూద్‌ రేపు ఉదయం నాటికి రెండు ఎద్దులను పంపిస్తానని తొలుత ట్వీట్‌ చేశాడు. అనంతరం ఎద్దులు కాదు.. ట్రాక్టర్‌ కొనిస్తానని వెల్లడించాడు. ఆ వెంటనే స్థానిక షోరూంలో ట్రాక్టర్‌ ఆర్డర్‌ చేసి.. షోరూం సిబ్బంది చేత రైతుకు ట్రాక్టర్‌ను అందజేశాడు. దీంతో నాగేశ్వరరావు కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. సోనూసూద్‌కు కృతజ్ఞతలు తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని