AP news: ఉత్తరాంధ్ర జిల్లా కలెక్టర్లతో సీఎం సమీక్ష

తాజా వార్తలు

Published : 25/05/2021 14:51 IST

AP news: ఉత్తరాంధ్ర జిల్లా కలెక్టర్లతో సీఎం సమీక్ష

అమరావతి: తుపాను ప్రభావిత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. యాస్‌ తుపాను దృష్ట్యా ముందస్తు చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వాతావరణ శాఖ నివేదికలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని అన్నారు. అధికారులు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ శ్రీకాకుళం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో జల్లులు తప్ప పెద్దగా ప్రభావం కనిపించలేదన్నారు. తాత్కాలిక నిర్మాణాల్లో కొవిడ్‌ రోగులు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఆక్సిజన్‌ కొరత రాకుండా జనరేటర్లు, డీజిల్‌ సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని