‘పోటీ చేయించి వైకాపా నేతలు మోసం చేశారు’

తాజా వార్తలు

Published : 04/04/2021 02:09 IST

‘పోటీ చేయించి వైకాపా నేతలు మోసం చేశారు’

సీఎంకు దేవనకొండ సర్పంచి అభ్యర్థి గీత లేఖ

దేవనకొండ: సర్పంచిగా పోటీ చేయించి వైకాపా నేతలు తనను మోసం చేశారని కర్నూలు జిల్లా దేవనకొండ సర్పంచి అభ్యర్థి గీత ఆరోపించారు. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆమె లేఖ రాశారు. ఖర్చంతా ఆమెతో పెట్టించి చివరకు ప్రత్యర్థులకు మద్దతిచ్చారన్నారు. వ్యవసాయం చేసుకునే తనను ఎన్నికల్లోకి దించారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం ఆదుకోవాలని లేదంటే ఆత్మహత్యే శరణ్యమని గీత లేఖలో పేర్కొన్నారు.

జిల్లాలోని దేవనకొండ మండల కేంద్రానికి చెందిన గీతను వైకాపా తరఫున సర్పంచి అభ్యర్థిగా ఎంపిక చేశారు. దేవనకొండకు చెందిన కొందరు వైకాపా నాయకులు ఆమెను నమ్మించి ఎన్నికల ఖర్చు నిమిత్తం రూ.40లక్షల వరకు ఖర్చు చేయించారు. ఇందుకోసం తనకున్న మూడెకరాల పొలాన్ని వైకాపాకు చెందిన ఓ నాయకుడికి అమ్మారు. అయితే ఎన్నికల్లో గీత ఓడిపోయారు. రూ.40లక్షలతో పాటు మూడెకరాల పొలం కూడా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడిపే తనను ఎన్నికల బరిలోకి దింపిన వైకాపా నాయకులు కష్టాల పాలు చేశారని సీఎం జగన్‌, మంత్రి జయరాంకు వేర్వేరుగా లేఖ రాశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని