నెల్లూరు వ్యక్తికి కరోనా పాజిటివ్‌

తాజా వార్తలు

Updated : 15/10/2021 22:14 IST

నెల్లూరు వ్యక్తికి కరోనా పాజిటివ్‌

నెల్లూరు: పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యక్తికి కొవిడ్‌-19 (కరోనా) వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ ధ్రువీకరించారు. బుధవారం కరోనా అనుమానిత లక్షణాలతో ఓ యువకుడు జీజీహెచ్‌లో చేరిన విషయం తెలిసిందే. యువకుడు ఇటీవలే ఇటలీ నుంచి వచ్చాడు. అతని నమూనాలను మొదట తిరుపతి స్విమ్స్‌లో పరీక్షించి కరోనా సోకినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అనంతరం పూర్తిస్థాయి పరీక్షల కోసం నమూనాలను పుణె పంపగా అక్కడ పాజిటివ్‌గా తేలినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బాధితుడిని నెల్లూరు జీజీహెచ్‌ ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా బాధితుడి కుటుంబసభ్యుల నమూనాలను పరీక్షించగా నెగటివ్‌ వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.

మరోవైపు కరోనా వైరస్‌ అనుమానంతో మరో మహిళ నెల్లూరు జీజీహెచ్‌లో చేరింది. ఆమెకు ఐసోలేషన్‌ వార్డులో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సదరు మహిళ ఇటీవల కువైట్‌ వెళ్లి వచ్చినట్లు సమాచారం. ఆమె నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షల కోసం పుణె పంపించినట్లు వైద్యులు తెలిపారు.

నెల్లూరులో కరోనా పాజిటిక్‌ కేసు నమోదైన నేపథ్యంలో సినిమా హాళ్లను మూసివేయాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పోర్చుగల్‌ నుంచి వచ్చిన 20 మందికిపైగా వ్యక్తులు నెల్లూరులోని ఓ హోటల్‌లో బస చేసినట్లు అధికారులు గుర్తించారు. కరోనా అనుమానంతో వైద్య పరీక్షలు పూర్తయ్యే వరకు హోటల్‌ వీడి వెళ్లొద్దని పోర్చుగల్‌ వాసులకు అధికారులు సూచించారు. వీరంతా నెల్లూరులోని ఓ పరిశ్రమలో పనిచేసేందుకు పోర్చుగల్‌ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని