కొవిడ్‌ బాధిత కుటుంబాలకు పెన్షన్‌
close

తాజా వార్తలు

Updated : 30/05/2021 07:11 IST

కొవిడ్‌ బాధిత కుటుంబాలకు పెన్షన్‌

బాలలకు భృతిని ప్రకటించిన కేంద్రం

దిల్లీ: కొవిడ్‌తో మరణించిన వారి కుటుంబాలకు పెన్షన్‌ అందజేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) ద్వారా ఈ మొత్తాన్ని ఇవ్వనున్నట్లు తెలిపింది. కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను లేదా వారిలో ఏ ఒక్కరినైనా కోల్పోయిన చిన్నారులకు సైతం పీఎం కేర్స్‌ నిధి ద్వారా.. 18 ఏళ్లు నిండగానే నెలవారీ భృతిని అందజేయనున్నట్లు పేర్కొంది. 23 ఏళ్లు నిండిన తర్వాత రూ.10 లక్షలు అందించనున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. చిన్నారులకు ఉన్నత విద్య కోసం రుణ సదుపాయం కల్పించడంతో పాటు ఆ మొత్తానికి సంబంధించిన వడ్డీని పీఎం కేర్స్‌ చెల్లిస్తుందని తెలిపింది. కొవిడ్‌ బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ పథకాలు వారి ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తాయని చెప్పారు.

‘‘కొవిడ్‌తో మరణించిన వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ప్రస్తుత నిబంధనల ప్రకారం సగటు రోజు కూలీలో 90 శాతం సొమ్మును పెన్షన్‌గా అందజేస్తారు. గతేడాది మార్చి 24 నుంచి 2022 మార్చి 24 వరకు ఈ పథకం వర్తిస్తుంది. ఉద్యోగుల బీమా పథకం అనుసరించి ఇచ్చే గరిష్ఠ బీమా మొత్తాన్ని రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెరిగింది. కనిష్ఠ బీమా కింద రూ.2.5 లక్షలను ఇచ్చే పథకాన్ని కూడా పునరుద్ధరించాం. ఈ పథకం గతేడాది ఫిబ్రవరి 15 నుంచి వచ్చే మూడేళ్లపాటు వర్తిస్తుంది. ఈ పథకాలకు సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడిస్తుంది’’ అని ప్రభుత్వం వివరించింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు కొవిడ్‌ బాధిత కుటుంబాల చిన్నారులకు భృతి సహా తమ సొంత పథకాలను ప్రకటించాయి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని