TS: ప్రైవేటు టీచర్లకు ప్రారంభమైన సాయం

తాజా వార్తలు

Published : 20/04/2021 21:35 IST

TS: ప్రైవేటు టీచర్లకు ప్రారంభమైన సాయం

హైదరాబాద్‌: తెలంగాణలోని ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రభుత్వం నిర్దేశించిన ఆపత్కాల సాయం పంపిణీ ప్రారంభమైంది. కరోనా కారణంగా విద్యాసంస్థలు మూతపడడంతో ఈనెల నుంచి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమయ్యే వరకు గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులు, సిబ్బందికి నెలకు రూ.2వేల ఆర్థిక సాయం, 25 కేజీల సన్నబియ్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ప్రైవేటు విద్యాసంస్థల ప్రధానోపాధ్యాయుల నుంచి వివరాలు తీసుకొని వాటిని డీఈవోల ద్వారా పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.25 లక్షల మంది ఉపాధ్యాయులు, సిబ్బందిని అర్హులుగా గుర్తించారు. ఆ వివరాల ఆధారంగా ఇవాళ్టి నుంచి ఆర్థిక సాయం పంపిణీ ప్రారంభమైంది. నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే ఆర్థికశాఖ నగదు జమ చేస్తోంది. రేపటి నుంచి సన్నబియ్యం పంపిణీ సైతం ప్రారంభం కానుంది. ఒక్కో కుటుంబానికి 25 కేజీల చొప్పున సన్నబియ్యాన్ని ఉచితంగా అందించనున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని