మూడు చోట్ల రేపు రీపోలింగ్‌

తాజా వార్తలు

Updated : 23/01/2020 20:07 IST

మూడు చోట్ల రేపు రీపోలింగ్‌

హైదరాబాద్‌: తెలంగాణలో జరిగిన పురపాలక ఎన్నికల్లో టెండర్ ఓట్లు దాఖలైన మూడు చోట్ల రేపు రీపోలింగ్ జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. మహబూబ్‌నగర్, కామారెడ్డి, బోధన్ పురపాలికల పరిధిలోని ఒక్కో పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో టెండర్ ఓట్లు దాఖలు కావడంతో ఎస్ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. 

మహబూబ్‌నగర్ పురపాలికలోని 41వ వార్డులోని 198, కామారెడ్డి 41వ వార్డులోని 101, బోధన్ 32వ వార్డులోని 87వ పోలింగ్ కేంద్రాల్లో రేపు రీపోలింగ్‌ నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 25వ తేదీన చేపడతారు. హైదరాబాద్‌లోని నిజాంపేటలోనూ టెండర్ ఓటు తరహాలోనే ఒక ఓటు నమోదైనప్పటికీ దాన్ని పూర్తిగా టెండర్ ఓటుగా పరిగణించలేమని అధికారులు పేర్కొనడంతో అక్కడ రీపోలింగ్ అవసరం లేకుండా పోయింది. ఆ ఓటును పరిగణనలోకి తీసుకోవాలా? లేదా? అనే దానిపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని