ప.గో, సూర్యాపేటలో కొత్త కేసుల నమోదు

తాజా వార్తలు

Published : 14/04/2020 19:29 IST

ప.గో, సూర్యాపేటలో కొత్త కేసుల నమోదు

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణలోని సూర్యాపేటలో 3, ఏపీలో పశ్చిమగోదావరి జిల్లాలో 4 కరోనా కేసులు నమోదైనట్లు ఆయా రాష్ట్రాల వైద్యారోగ్య శాఖలు వెల్లడించాయి. సూర్యాపేటలో నమోదైన కేసుల్లో.. సూర్యాపేటలో ఇద్దరు, తిరుమలగిరిలో ఒకరికి కరోనా సోకినట్లు జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణా రెడ్డి వెల్లడించారు. ఇవాళ పరీక్షించిన 80 నమూనాల్లో 77 మందికి నెగటివ్ రాగా ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు. తాజగా నమోదైన 3 కేసులతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 30కి చేరింది.

పశ్చిమగోదావరిలో మరో 4 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏలూరులో 3, పెనుగొండలో ఒక కేసు నమోదైనట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. తాజాగా నమోదైన కేసులతో ఏలూరులోని తంగెళ్లమూడి ప్రాంతంలో 11కి, పెనుగొండలో 6కి కేసుల సంఖ్య చేరిందని అధికారులు వెల్లడించారు. జిల్లాలో ఇప్పటివరకు 973 రక్తనమూనాలు సేకరించగా వాటిలో 27 పాజిటివ్‌, 678 నెగటివ్‌ రాగా మరో 268 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని