ఆదేశాలు ఉల్లంఘిస్తే స్కూళ్ల గుర్తింపురద్దు: సబిత

తాజా వార్తలు

Updated : 20/04/2020 20:22 IST

ఆదేశాలు ఉల్లంఘిస్తే స్కూళ్ల గుర్తింపురద్దు: సబిత

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా తల్లిదండ్రులు ఆదాయం కోల్పోయినందున రాష్ట్రంలోని ప్రైవేట్‌ పాఠశాలల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది ఫీజులు పెంచవద్దని యాజమాన్యాలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఏ రూపంలో అధిక రుసుములు వసూలు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని.. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘిస్తే గుర్తింపు రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. 

ఒకేసారి ఫీజులు చెల్లించేలా పాఠశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకురాకూడదని.. నెలవారీగా వాయిదాల్లో తీసుకునేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. రేపటి నుంచి 6-10 తరగతుల విద్యార్థులకు టీ శాట్ ద్వారా డిజిటల్ పాఠాల బోధన జరుగుతుందని చెప్పారు. రోజుకో సబ్జెక్టు పాఠాలు ప్రసారం అవుతాయని వివరించారు. టీశాట్ యాప్‌లో 513 పాఠాలు అందుబాటులో ఉన్నాయన్నారు. www.scert.telangana.gov.in వెబ్‌సైట్‌లో ఒకటి నుంచి పదో తరగతి వరకు ఈ- పాఠ్యపుస్తకాలను పొందుపరిచినట్లు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని