దగ్గర్లో రేషన్‌ దుకాణం ఎక్కడ? 

తాజా వార్తలు

Published : 01/05/2020 17:30 IST

దగ్గర్లో రేషన్‌ దుకాణం ఎక్కడ? 

‘గూగుల్‌’లో భారతీయుల టాప్‌ సెర్చింగ్‌ వివరాలు విడుదల

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండిపోయారు. ఈ క్రమంలో ఇంటర్నెట్‌ సౌకర్యం ఉన్నవారు ఆన్‌లైన్‌లో కాలం వెళ్లదీస్తున్నారు. భారతీయులు ప్రముఖ సెర్చింజన్‌ ‘గూగుల్‌’లో ఏం వెతికారో వెల్లడిస్తూ.. సదరు సంస్థ ‘వాట్ ఇజ్‌ ఇండియా సెర్చింగ్‌ ఫర్‌?’ పేరిట ఒక నివేదిక విడుదల చేసింది. ఇందులో అనేక ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. నియర్‌ మీ, ఏవి బెస్ట్‌, ఇంట్లోనే ఉంటూ ఏం నేర్చుకోవచ్చు, ఆన్‌లైన్ చెల్లింపులు.. తదితర అంశాలు టాప్‌ ట్రెండ్‌లో నిలిచాయి. కరోనా తర్వాత ప్రజల్లో వచ్చిన మార్పునకు ఇవి అద్దంపట్టాయి.

వర్క్‌ ఫ్రం హోం ఎలా..

మార్చి నుంచి ‘నియర్‌ మీ’ విభాగంలో ఎక్కువ మంది నెటిజన్లు అత్యవసర సేవలపై ఆరా తీశారు. రేషన్‌ దుకాణం, వైద్య సదుపాయం తదితర అంశాలపై సెర్చ్‌ చేశారు. ‘రేషన్‌ దుకాణం ఎక్కడ’ అని వెతకడంలో 300 శాతానికిపైగా వృద్ధి కనిపించడం గమనార్హం. ఏవి బెస్ట్‌ అన్నదాంట్లో హెడ్‌సెట్లు, సినిమాలు, వ్యాపార వేదికలపై ఆరా తీశారు. ఇంట్లోనే జిమ్‌, 5 నిమిషాల్లో వంటలు, ఆన్‌లైన్‌ శిక్షణ, బోధన వంటివాటి కోసం వెతికారు. యూపీఐ పిన్‌ను మార్చుకోవడం ఎలా అని సెర్చ్‌ చేయడంలో 200 శాతం పెరుగుల నమోదైంది. ప్రతి ఇద్దరు వినియోగదారుల్లో ఒకరు.. పిల్లలను చదివించడం ఎలా, వర్క్‌ ఫ్రం హోం, ఆన్‌లైన్‌ వేదికలు, ఫ్రీ వీడియో డేటింగ్‌ అంశాలపై వెతికారు. ఈ క్రమంలో ఇంటర్నెట్‌ వినియోగం కూడా పెరిగిపోయింది. ఒక్కో వినియోగదారు వారానికి నాలుగు గంటలపాటు వీడియోలు చూసినట్లు తేలింది. వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫాం, ఇమ్యూనిటీ, విటమిన్‌ సీ, ఆన్‌లైన్‌లో వైద్యుడిని సంప్రదించడం ఎలా తదితర అంశాల్లో వృద్ధి నమోదైంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని